Drive Vehicles Without License : డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా.. ఈ టూ వీలర్స్‌పై జాలీగా రైడ్ చేయవచ్చు..
ABN , Publish Date - Mar 02 , 2025 | 02:37 PM
Drive Two Wheelers Without License: రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బయట అడుగుపెట్టాలంటే కచ్చితంగా స్కూటీ లేదా బైక్ ఉండాల్సిందే. లైసెన్స్ లేకుండా బైక్ నడపడం నేరమని అందరికీ తెలుసు. కానీ, ఈ టూ వీలర్స్‌కు రెండూ అవసరం లేదు. ఇంధన ఖర్చులు, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం బెస్ట్ స్కూటర్లు ఇవే..
Best Electric Scooters without License : నిత్యావసరాల్లో ఇంధన ఖర్చులు భాగమయ్యాయి. ఎప్పటికప్పుడు డీజిల్, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల వారి బడ్జెట్ గతి తప్పుతోంది. అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. ఇంధనంతో పనిలేకుండా విద్యుత్ ఛార్జింగ్‌తో నడిపే వెసులుబాటే ప్రజలు వీటి వైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం. ఇక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తోడ్పడే ఈవీ స్కూటర్ల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయి. మరి, తక్కువ ధరలోనే లైసెన్స్ అవసరం లేకుండా క్వాలిటీ బ్యాటరీ, మంచి స్పీడ్, మైలజ్, కాలుష్యరహితమైన ఈ బెస్ట్ ఈవీ స్కూటర్లపై ఓ లుక్కేయండి..
పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే టూ వీలర్స్ కంటే ఈవీ వాహనాలకు అయ్యే ఖర్చు తక్కువ. నిజానికి, 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం.. 25 కిలోమీటర్ల గరిష్ఠ వేగం, 250 వాట్ల కంటే తక్కువ శక్తి కలిగిన వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మంచి రేంజ్ ఇచ్చేందుకు ఈవీ స్కూటర్లలో అధిక శక్తిగల మోటార్లను వినియోగిస్తున్నారు. అలాంటి 4 అత్యుత్తమ మోడళ్ల గురించి తెలుసుకుందాం..
లోహియా ఓమా స్టార్
దీని ప్రారంభ ధర రూ. 51,750లు. బ్యాటరీ 3 సంవత్సరాల వారంటీ ఇస్తారు. 4.5 నుండి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇంధన సామర్థ్యం 4.5 లీటర్లు. 70 కి.మీ రేంజ్‌తో గంటకు 25 కి.మీ వేగంతో వెళుతుంది.
ఆంపియర్ రియో ఎలైట్
ఆంపియర్ రియో ఎలైట్ స్కూటర్ ధర రూ.42,999 నుంచి ప్రారంభమవుతుంది. బరువు 94 కిలోలు. వారంటీ 3 సంవత్సరాలు. 60V, 20Ah లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ. వరకు వెళుతుంది. 4-5 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ. ఎరుపు, నీలం, తెలుపు, నలుపు రంగుల్లో లభ్యమవుతుంది.
కోమాకి ఎక్స్‌జీటీ కేఎం
కోమాకి ఎక్స్‌జీటీ కేఎం ఈవీ ప్రారంభ ధర రూ.60,279. ఒకసారి ఛార్జ్ చేస్తే 100కి.మీ వెళ్తుంది. వేగం గంటకు 60 కిలోమీటర్లు. . 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది 130-150 కి.మీ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీకి 1 సంవత్సరం వారంటీ ఇస్తారు.
ఒకినావా ఆర్30
ఒకినావా ఆర్30 ఎలక్ట్రిక్ స్కూటీ ప్రారంభ ధర రూ.61,998 వరకు ఉంటుంది. . 3 సంవత్సరాల పాటు బ్యాటరీకి వారంటీ వస్తుంది. 250 వాట్ల శక్తితో నడిచే ఈ స్కూటర్ 60 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంటకు 25 కి.మీ వేగంతో వెళ్లవచ్చు. 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది
Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..
SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..