Film Industry Success Zodiac Signs: ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయం!
ABN , Publish Date - Sep 08 , 2025 | 08:24 AM
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే, ఏ రాశి గురించి వారు ఇలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సినీ పరిశ్రమలో విజయం సాధించడం అంత ఈజీ కాదు. ఎంత కష్టపడినా సరే అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలని చాలా మంది అంటారు. అయితే, జ్యోతిష్యం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయమని జ్యోతిష నిపుణులు అంటున్నారు. అయితే, ఏ రాశి గురించి వారు ఇలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి నటనలో విజయం సాధించాలంటే, వారి జాతకంలో శుక్రుడు, బుధుడు, బృహస్పతి బలంగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే.. శుక్రుడు కళ, నటన, అందం, ఆకర్షణను సూచిస్తాడు. ఈ గ్రహం వృషభం, తుల లేదా మీన రాశిలో బలంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సంభాషణా సామర్థ్యాన్ని నిర్ణయిస్తాడు. బృహస్పతి అదృష్టం, విజయాన్ని తెస్తాడు. ఈ మూడు గ్రహాలతో పాటు, చంద్రుని బలం కూడా ముఖ్యం. చంద్రుని బలం భావోద్వేగ వ్యక్తీకరణ, నటనలో ప్రజాదరణను పెంచుతుంది. అలాగే, రాహువు మంచి స్థానం దృఢ సంకల్పాన్ని ఇస్తుంది.
ఈ గ్రహాల కలయిక సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తికి విజయాన్ని తెస్తుంది. అయితే, జ్యోతిషశాస్త్రంతో పాటు కృషి, మంచి కళా నైపుణ్యాలు, అంకితభావం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )
Also Read:
ఎర్ర సముద్రంలో కేబుల్ కట్..భారత్, ఆసియా, పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ సమస్యలు
వెల్లుల్లిని తేనెలో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
For More Latest News