Baby's First Hair Cut: చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం వెనుక శాస్త్రీయ కారణం ఉందా?
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:50 AM
సంప్రదాయలకు పుట్టినిల్లు భారతదేశం. అందులోనూ హిందువులకు అనేక ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే, చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం వెనుక సంప్రదాయం తోపాటు శాస్త్రీయ కారణం కూడా ఉందా?
ఇంటర్నెట్ డెస్క్: సంప్రదాయలకు పుట్టినిల్లు మన భారతదేశం. అందులోను హిందువులకు అనేక ఆచారాలు, సంప్రదాయాలు, ఉంటాయి. చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం కూడా ఒక సంప్రదాయం. అయితే, ఈ సంప్రదాయం వెనుక కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా?
పిల్లలకు పుట్టెంటుకలు తీయడాన్ని ముండన్ లేదా కేశ ఖండన అంటారు. సాంప్రదాయకంగా, ఇది హిందూ సంస్కృతిలో ఒక భాగం. సాధారణంగా పిల్లలకు 6 నెలలు లేదా ఏడాది వయసులో తీస్తారు. 1 నుండి 3 సంవత్సరాల మధ్య కూడా తీయవచ్చు. కొన్ని కుటుంబాలు పిల్లలకు 9 లేదా 11 నెలలలో కూడా తీయిస్తారు. దానికి కారణం.. ఉమ్మనీరు తలకు అతుక్కోని ఉంటుంది. అలానే జుట్టు పెరిగితే బాక్టీరియా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా పుట్టెంటుకలు తీస్తే తర్వాత వచ్చే జుట్టు బాగుంటుందని అంటారు.
ఇలా చేయడం వల్ల పుట్టినప్పుడు తల్లి గర్భంలోని ఉమ్మనీరుతో పాటు శరీరంపై ఉన్న సూక్ష్మక్రిములను, చర్మాన్ని తొలగించి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది అనే ఒక శాస్త్రీయ కారణం ఉంది. అంతేకాకుండా, హిందూ సంప్రదాయంలో, పుట్టెంటుకలు తీయడం అనేది గత జన్మల కర్మలను తొలగించి, బిడ్డకు స్వచ్ఛమైన, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఈ సంప్రదాయం పిల్లలు ఆరోగ్యంగా, శుభ్రంగా, స్వచ్ఛమైన మనస్సుతో పెరగాలని కోరుతూ చేస్తారు.
Also Read:
గోదారమ్మ ఉగ్రరూపం.. బాసరకు తగ్గిన భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉంది: శివకుమార్
For More Latest News