Stree Shakti Scheme: ఫ్రీ బస్సు పథకంపై వైసీపీ కొత్త కుట్ర..!
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:47 PM
అధికారం పోవడంతో ఆగమాగం అయిపోతున్న వైసీపీ నేతలు.. నిత్యం ఏదోరకంగా కుట్రలకు తెర లేపుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు స్కీమ్‌ను సైతం నిర్వీర్యం చేసేలా..
అమరావతి, ఆగస్టు 29: అధికారం పోవడంతో ఆగమాగం అయిపోతున్న వైసీపీ నేతలు.. నిత్యం ఏదోరకంగా కుట్రలకు తెర లేపుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు స్కీమ్‌ను సైతం నిర్వీర్యం చేసేలా కుట్రలకు తెరలేపారు వైసీపీ నాయకులు. ప్రయాణికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ వైసీపీ కుట్రలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. తగినన్ని బస్సులను కేటాయించడం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తోంది. మొదటి నుంచి అసత్యాలనే నమ్ముకున్న వైసీపీ నేతలు.. స్త్రీ శక్తి పథకంపైనా అసత్యారోపణలు చేస్తోంది. సోషల్ మీడియాతో ఇష్టమొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
విశాఖపట్నంలో కుర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో 99 మంది మహిళలతో కలిపి మొత్తం 130 మంది ప్రయాణించారంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. ఓవర్ లోడ్ కారణంగా బస్సులో మంటలు అంటూ సొంత కవిత్వాలు అల్లేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 11,448 బస్సులలో 8,458 సర్వీసులను మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయించింది కూటమి సర్కార్. అంటే 74 శాతం బస్సులను ఉచిత ప్రయాణానికే కేటాయించారు. ఇంత భారీ స్థాయిలో బస్సులు కేటాయించినప్పటికీ.. వైసీపీ శ్రేణులు మాత్రం స్త్రీ శక్తి పథకంపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. అసలు బస్సులే కేటాయించలేదంటూ సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై కూటమి పార్టీల నేతలు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ మొదటి నుంచి అసత్య ప్రచారాలకు కేరాఫ్ అని అన్నారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించొద్దని సూచిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు.
Also Read:
ప్రకృతి ప్రేమికుల కోసం IRCTC ప్రత్యేక పర్యటన..
బీసీసీఐకి బిన్నీ రాజీనామా..రాజీవ్ శుక్లాకు..
For More Andhra Pradesh News and Telugu News..