Share News

Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమనకు పోలీసుల నోటీసులు

ABN , Publish Date - Oct 21 , 2025 | 04:18 PM

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డికి తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమనకు పోలీసుల నోటీసులు
Bhuma Karunakar Reddy

తిరుపతి, అక్టోబర్ 21: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డికి(Bhuma Karunakar Reddy) తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలోనే ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.


శ్రీ వెంకటేశ్వర గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయంటూ ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు చేశారు. వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అయితే, భూమన చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. మరోవైపు ఆయన చేసిన ఆరోపణలను పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలోనే కొందరు భూమనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, సాక్ష్యాలు చూపాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. మరి పోలీసుల విచారణకు భూమన హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ

Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..

Updated Date - Oct 21 , 2025 | 04:53 PM