Expensive Cow : అధరగొట్టిన ఒంగోలు జాతి ఆవు
ABN , First Publish Date - 2025-02-05T04:39:26+05:30 IST
కానీ ఒక ఆవు రూ. 41 కోట్లు ధర పలికితే.. అమ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన వేలంలో వియాటినా-19 అనే పేరు గల ఆవు 4.8 మిలియన్ డాలర్లు
బ్రెజిల్ వేలంలో రూ. 41 కోట్లు ధర
అత్యంత ఖరీదైన గోవుగా ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఒక ఆవు సాధారణంగా వేలల్లో ధర పలుకుతుంది. పాలు ఎక్కువ ఇచ్చే కొంచెం మంచి జాతి అయితే ఓ రెండు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. కానీ ఒక ఆవు రూ. 41 కోట్లు ధర పలికితే.. అమ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన వేలంలో వియాటినా-19 అనే పేరు గల ఆవు 4.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.41 కోట్లు) ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. అది మన ఒంగోలు జాతికి చెందిన ఆవు కావడం. ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన జాతులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్‌కు చెందిన వాగ్యు, భారత్‌కు చెందిన బ్రాహ్మణ్‌లను బ్రెజిల్‌లోని మినాస్ గెరెయి్‌సలో పుట్టి పెరిగిన వియాటినా ఈ వేలంతో వెనక్కినెట్టింది. అంతేకాకుండా పశువుల పరిశ్రమలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ఒంగోలు జాతికి ఉండే అద్వితీయమైన శరీర సౌష్ఠవం, జాతి లక్షణం వియాటినాను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. శరీరం అంతా తెల్లటి రంగులో మిలమిల మెరుస్తూ ఉంటుంది. పైచర్మం వదులుగా ఉండటంవల్ల ఇది ఎంతటి ఉష్ణ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది. విశేషంగా ఉండే మూపురం, బలిష్టమైన కండరాల నిర్మాణం వియాటినాకు ప్రత్యేకం. దీని అసాధారణ జన్యు నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిని మరో మలుపుతిప్పుతుందని భావిస్తున్నారు.
మిస్ సౌత్ అమెరికా కిరీటం..
ఒంగోలు జాతి ఆవు కంటే డబుల్ సైజులో వియాటినా ఉంటుంది. 1,101 కిలోల బరువుంది.
అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సాధించింది.
బలిష్టమైన శరీరాకృతితో, అందమైన మూపురంతో చూపరులను ఆకట్టుకునే వియాటినా.. ఆవుల చాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని దక్కించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News