Share News

Wine Shops Bund: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆదివారం వైన్స్ బంద్.. ఎందుకంటే

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:16 PM

Wine Shops: జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా వైన్ షాపులు ఉండవు. ఈరోజు రాత్రి నుంచే మద్యం దుకాణాలు క్లోస్ అవుతాయి. అలాగే బార్లు, పబ్స్‌ కూడా మూసివేస్తారు. దీంతో అలర్ట్‌ అయిన మద్యం ప్రియులు ముందుగానే వైన్‌ షాపుల ముందు వాలిపోయి తమకు కావాల్సినంత మద్యాన్ని కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు.

Wine Shops Bund: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆదివారం వైన్స్ బంద్.. ఎందుకంటే
Wine Shops Bund

వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది మద్యం, నాన్‌వెజ్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆదివారం నాన్‌ వెజ్ ఉండాల్సిందే. దానితో పాటు మద్యం తాగుతూ వీకెండ్‌ను గడుపుతుంటారు కొందరు. కానీ ఈ ఆదివారం మాత్రం మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం రోజు మాత్రమే లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాలు మూత పడతాయి.


మద్యం షాపుల ముందు ఇప్పటికే రేపు (జనవరి 26) వైన్ షాపులు బంద్ అనే బోర్డులు పెట్టేశారు కూడా. దీంతో ఈరోజు (శనివారం) నుంచే షాపుల ముందు క్యూ కట్టారు మద్యం ప్రియులు. ఈ క్రమంలో మద్యం షాపుల వద్ద రద్దీ పెరిగింది. రేపు సెలవు నేపథ్యంలో ముందుగానే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు.

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే


జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా వైన్ షాపు ఉండవు. ఈరోజు రాత్రి నుంచే మద్యం దుకాణాలు క్లోస్ అవుతాయి. అలాగే బార్లు, పబ్స్‌ కూడా మూసివేస్తారు. దీంతో అలర్ట్‌ అయిన మద్యం ప్రియులు ముందుగానే వైన్‌ షాపుల వద్దకు వాలిపోయి తమకు కావాల్సినంత మద్యాన్ని కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు.


కఠిన చర్యలు తప్పవు...

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలో మద్యం షాపులు బంద్‌ కానున్నాయి. మద్యం షాపులతో పాటు మటన్, చికెన్ షాపులు కూడా మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆదేశాలు వర్తిస్తాయని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

Ganta Srinivas: వైసీపీలో చివరకు మిగిలేది ఆయన ఒక్కరే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 02:19 PM