Kolleru.. సుప్రీం కోర్టు డెడ్‌లైన్‌తో కొల్లేరులో మళ్లీ టెన్షన్...
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:16 PM
కొల్లేరు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ తరగని సొమ్ములిచ్చే అక్షయ పాత్రే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొల్లేరు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు అక్రమంగా చేపల చెరువులు తవ్వడం, తద్వారా కోట్లాది రూపాయలు వెనేకేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే తాజగా సుప్రీం కోర్టు డెడ్ లైన్‌లో కొల్లేరులో మళ్లీ టెన్షన్ మొదలైంది.

పశ్చిమగోదావరి జిల్లా: కొల్లేరు (Kolleru) మళ్లీ టెన్షన్ (Tension) పెడుతోంది. చేపల చెరువులు (Fish Ponds) పెట్టుకునేవారికి నిద్ర పట్టడంలేదు. సుప్రీం కోర్టు (Supreme Court) డెడ్‌లైన్ (Deadline)తో రాజకీయ నాయకులకు సయితం దిక్కుతోచని పరిస్థితి వస్తోంది. కొల్లేరు అభయారణ్యం పరిధి, అక్రమ చెరువుల అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. కొల్లేరులోని అక్రమ చెరువులను కొట్టేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కొల్లేరు కబ్జాదారులు కంగు తిన్నారు. నిన్న మొన్నటి వరకు తమ చదరంగంలో కొల్లేరును పావుగా వాడుకున్న రాజకీయ పార్టీల పరిస్థితి ఇప్పడు అయోమయోంలో పడింది. కొల్లేరు కాంటూరు పరిధిని తగ్గించాలని.. కొల్లేరు వాసులు దశాబ్దాలుగా చేస్తున్న వినతి సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో పుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ వార్త కూడా చదవండి..
గంగుల కమలాకర్ వర్సెస్ మేయర్ సునీల్ రావు
రాజకీయ నాయకులకు అక్షయపాత్ర
కొల్లేరు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ తరగని సొమ్ములిచ్చే అక్షయ పాత్రే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొల్లేరు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు అక్రమంగా చేపల చెరువులు తవ్వడం, తద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. మరోవైపు చూస్తే ప్రతి రాజకీయ పార్టీ కొల్లేరు కాంటూరును కుదిస్తామంటారు. అధికారంలోకి వచ్చాక అధి మాపని కాదని వ్యవహరిస్తారు. 2006 వరకు కొల్లూరు వాసులకు ఈ సమస్య లేదు. తర్వాత ప్రారంభమైన ఈ సమస్య కొల్లేరు గ్రామవాసులకు ఉపాధి ఆహరం లేకుండా చేసింది. వేలాది మంది ప్రజలు వలసలకు దారి తీసింది.
కొల్లేరులోని 77,138 ఎకరాలను అభయారణ్యంగా ప్రకటిస్తూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఎటువంటి ఆక్రమణలు అక్రమ చెరువు చేపలు ఉండకూడదు. జీవో జారీ చేసిన టీడీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా వదిలేయడంతో కొల్లూరు వాసుల ఉపాధికి, అక్రమ చెరువులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే 2006లో జీవో అమలు చేసే క్రమంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం కొల్లేరులోని అన్ని చెరువులను ధ్వంసం చేసింది. దాంతో ఆ చెరువులపై ఆధారపడిన కొల్లేరు వాసులకు ఉపాధి లేకుండా పోయింది. కొన్ని గ్రామాల ప్రజలైతే ఇతర రాష్ట్రాలకు చెరువుల్లో పని చేయడానికి వలస వెళ్లిపోయారు. కానీ 2009లో రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అప్పటి వైఎస్ సర్కార్ కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పటి యూపీఏ సర్కార్‌కు పంపింది. అలా తగ్గించడం వలన అభయారణ్యం విస్తీర్ణం దాదాపు 40 వేల ఎకరాలకు తగ్గి అవన్నీ పేదలకు అందుబాటులోకి వస్తాయనేది ఈ తీర్మానం సారాంశం.
మళ్లీ తెరపైకి కాంటూరు కుదింపు అంశం..
కేంద్ర రాష్ట్రాల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మీళ్లీ ఈ సమస్య ఎదురవ్వడంతో అప్పటి పర్యావరణ మంత్రి జయరాం రమేష్ స్వయంగా కొల్లేరులో పర్యటించారు. తర్వాత ఆయన నియమించిన అజీజ్ కమిటీ కొల్లేరులో పర్యటించి కాంటూరు కుదింపు అంశంపై అధ్యయనం చేసింది. అదే కమిటీ కొన్ని నెలల తర్వాత కుదింపు సాధ్యం కాదని తేల్చింది. 2014, 2009 ఎన్నికల్లోనూ కాంటూరు కుదింపు అంశం తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు ఒకే తరహాలో కాంటూరును కుదించేస్తామంటూ హామీలు గుప్పించాయి. అయినా ఫలితాలు శూన్యం. 2024 ఎన్నికల్లో కొల్లూరు అంశం రాజకీయ పార్టీలకు తూరుపు ముక్కగా మారింది. 2019 ఎన్నికల్లో ఈ అంశానని జగన్ తన ఎన్నికల ఎజెండాలో ప్రధాన సమస్యగా ప్రస్తావించారు. ఒక్క అవకాశం ఇవ్వండి కాంటూరు పరిధిని తగ్గించి చూపిస్తానంటూ చెప్పడంతో అక్కడి ప్రజలు నమ్మారు. ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన జగన్ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు.
మార్చి డెడ్ లైన్..
2024 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు కొల్లూరు ఓటర్ల ఓట్లు కోసం అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ విషయంలో కొల్లేరు వాసులు టీడీపీని నమ్మి ఆ పార్టీ పక్షాన నిలబడ్డారు. కూటమి అధికారంలోకి రావడంతో కొల్లేరు వాసులకు కాస్త ఊరటనిచ్చాయి. ఈ పరిస్థితుల్లో కొల్లూరు ఆక్రమణలపై సుప్రీం విచారణ చేపట్టింది. దాంతో అటవిశాఖ అధికారులు కొల్లేరులో అక్రమ చెరువులు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన విచారణలో న్యాయస్థానికి న్యాయవాదులు వివరించారు. ఇంకా 17వేల ఎకరాల్లో అక్రమచెరువులు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. వాటిని కూడా మార్చిలోగా తొలగించాలని న్యాయమూర్తులు ఆదేశించగా ప్రస్తుత అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ పరిణామాలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజాప్రతినిధులకు మింగుడు పడని విధంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కు.ని. ఆపరేషన్.. డాక్టర్ల నిర్లక్ష్యం.. మహిళ మృతి..
భుజంగరావు అవినీతిపై ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News