Share News

Nuzvid IIIT College Incident: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ఫ్యాకల్టీని కత్తితో పొడిచి..

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:54 AM

నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని అధ్యాపకుడిపై విద్యార్థి అతి దారుణంగా దాడి చేశాడు.

Nuzvid IIIT College Incident: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ఫ్యాకల్టీని కత్తితో పొడిచి..
Nuzvid IIIT College Incident

ఏలూరు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఆగ్రహించిన ఒక విద్యార్థి అధ్యాపకుడిపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంటెక్ విద్యార్థి వినయ్ పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. అయితే, అధ్యాపకుడు గోపాల్‌రాజు విద్యార్థి వినయ్‌ను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహించిన వినయ్, ఫ్యాకల్టీ సభ్యుడు గోపాల్‌రాజుపై దాడి చేశాడు.


గోపాల్‌రాజును కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత వెంటనే హాస్టల్‌లోకి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమై విద్యార్ధులు గాయపడిన అధ్యాపకుడిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో క్యాంపస్‌లో ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.


Also Read:

మల్లెపూలు తీసుకెళ్లినందుకు భారీ ఫైన్.. మలయాళ నటికి ఆస్ట్రేలియాలో వింత అనుభవం..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట, పరువునష్టం దావా కేసు విచారణకు సుప్రీం నిరాకరణ

For More Latest News

Updated Date - Sep 08 , 2025 | 12:00 PM