Navya Nair fine: మల్లెపూలు తీసుకెళ్లినందుకు భారీ ఫైన్.. మలయాళ నటికి ఆస్ట్రేలియాలో వింత అనుభవం..
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:41 AM
మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. మల్లెపూలు పెట్టుకుని ఆస్ట్రేలియా వెళ్లినందుకు ఆమెకు భారీ జరిమానా ఎదురైంది. ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు షాకిచ్చారు.
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair)కు ఆస్ట్రేలియాలో వింత అనుభవం ఎదురైంది. మల్లెపూలు పెట్టుకుని ఆస్ట్రేలియా వెళ్లినందుకు ఆమెకు భారీ జరిమానా ఎదురైంది. ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు షాకిచ్చారు. ఈ విషయాన్ని నవ్య నాయర్ వెల్లడించింది. ఓనం పండగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓ కార్యక్రమం నిర్వహించింది (Navya Nair fined).
కేరళకు చెందిన నటి నవ్య నాయర్ ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ఆ సమయంలో ఆమె జడలో, బ్యాగ్‌లో మల్లెపూలు ఉన్నాయి. దీంతో మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను ఆపారు. మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్ వేశారు (Jasmine flowers banned in Australia). ఈ విషయాన్ని నవ్య నాయర్ వెల్లడించింది. ఆస్ట్రేలియా వచ్చే ముందు తన తండ్రి మల్లెపూల దండ కొనిచ్చారని నవ్య చెప్పింది. తన తండ్రి ఇచ్చిన పూలలో కొన్నింటిని జడలోనూ, మరికొన్నింటిని బ్యాగ్‌లోనూ పెట్టుకున్నానని తెలిపింది. అది తెలియక చేసిన పొరపాటని చెప్పింది (Jasmine gajra fine Australia).
అధికారులు తనకు 1.14 లక్షల జరిమానా విధించారని, 28 రోజుల లోపు చెల్లించాలని నోటీస్ ఇచ్చారని నవ్య పేర్కొంది. కాగా, ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైనా ఆస్ట్రేలియా వచ్చే ముందు పువ్వులు పెట్టుకుంటే ముందుగానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది (Melbourne Airport biosecurity). మొక్కలకు సంబంధించిన వాటిని తీసుకొచ్చే ముందుగానే డిక్లేర్ చేయకపోతే భారీ జరిమానా, క్రిమినల్ ఛార్జ్‌లను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. బయో సెక్యూరిటీ విషయంలో ఆస్ట్రేలియా కఠిన నిబంధనలను అనుసరిస్తుంది.
ఇవి కూడా చదవండి..
పాముల ప్రేమగాథ.. ప్రియుడు చనిపోయాడని ఆ ఆడపాము ఏం చేసిందంటే..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలని మొత్తం పులులను 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..