JanaSenaParty: జనసేన పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:03 PM
JanaSenaParty: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే.. బై ఎలక్షన్ వస్తుందని కొంత మంది చూస్తున్నారన్నారు.
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 30: తనతో ఉన్న కొంత మంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను ఎన్డీఏ ఎమ్మెల్యేని.. తాను చనిపోతే ఉప ఎన్నిక వస్తే.. కొంత మంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదన్నారు.
మూడు పార్టీలు కలిసి తనకు మ్యాండేడ్ ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. తాను గెలిచిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తున్నానన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టి.. వారిని బెదిరిస్తే సహించేది లేదని.. వారిని కాపాడుకుంటానని ఆయన స్పష్టం చేశారు. తాను చనిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
తనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండేట్ ఇస్తే.. తాడేపల్లిగూడెం ప్రజల వల్ల ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. ఎవరి దయ దక్షిణ్యాల వలన తాను గెలవలేదని తెలిపారు. మరో పిఠాపురం చేసేస్తానంటున్నారని.. తానేమీ చేతికి గాజులు తొడుక్కోలేదన్నారు.
తాను స్థలాలు, పొలాలు పూడ్చ లేదని.. కానీ తనకు ఓట్లు వేసి గెలిచిపించిన ప్రజల కోసం తాను పని చేస్తున్నానంటూ ఆయన కుండ బద్దలు కొట్టారు. తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తను తాను ఇబ్బంది పెట్టలేదన్నారు. కానీ శాసన సభ్యుడిగా మాత్రం గౌరవం ఇవ్వండంటూ కూటమిలోని మిత్ర పక్ష పార్టీ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖపట్నంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత
Weather Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
For AndhraPradesh News And Telugu News