విశాఖపట్నంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత

ABN, Publish Date - Apr 30 , 2025 | 02:39 PM

సింహాచలంలో కొలువు తీరిన శ్రీవరాహా లక్ష్మీనరసింహా స్వామి వారి చందనోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారి నిజ రూప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అందుకోసం క్యూ లైన్‌లో నిలబడిన వారిపై పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో బాధిత కుటుంబాలను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.

Updated at - Apr 30 , 2025 | 02:40 PM