Share News

Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:26 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురంలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.

Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏలూరు, నవంబర్ 23: ఏలూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆయన దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.


అంతకు ముందు సోమవారం ఉదయం 10 గంటలకు విమానంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఐ.ఎస్.జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడి కార్యక్రమం పూర్తయిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా మళ్లీ రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు పవన్ బయలుదేరి వెళ్తారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి

హ్యాకైన మంత్రుల వాట్సాప్ గ్రూపులు.. !

For More AP News And Telugu News

Updated Date - Nov 23 , 2025 | 09:05 PM