Ministers whatsapp Group Hack: హ్యాకైన మంత్రుల వాట్సాప్ గ్రూపులు.. !
ABN , Publish Date - Nov 23 , 2025 | 03:44 PM
సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్‌బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆ తర్వాత..
హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలు చేస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్లను సైతం హ్యాక్ చేస్తూ సవాలు విసురుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్‌బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని మంత్రులు, జర్నలిస్టులకు ఎస్‌బీఐ పేరుతో సందేశాలు పంపి గ్రూపులను హ్యాక్ చేశారు. ఈ ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
ఎస్‌బీఐ ఆధార్ అప్‌డేట్ పేరుతో హ్యాకర్లు ఏపీకే ఫైల్స్‌ను పంపి వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. అలా పలు మీడియా గ్రూపులు, సీఎంవో గ్రూపులు, డిప్యూటీ సీఎంవో గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులను హ్యాకర్ల తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పీఆర్వోల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లూ హ్యాక్ అయ్యాయని సందేశాలు వస్తున్నాయి. వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనతో సైబర్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హ్యాకైన వాట్సప్ గ్రూపులను సురక్షితంగా ఉంచారు. హ్యాకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Transgenders: నిప్పంటించుకున్న ఘటనలో మరో ట్రాన్స్‌జెండర్ మృతి
ibomma Trial: ఐబొమ్మ రవి నాలుగో రోజు విచారణలో కీలక విషయాలు!
For More TG News And Telugu News