AP News: వెయిట్ లిఫ్టర్‌కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:34 PM
ఆంధ్రప్రదేశ్: ఉత్తరాఖండ్ వేదికగా 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి.

అమరావతి: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏపీకి మెడల్స్ క్యూ కడుతున్నాయి. పురుషుల 67 కిలోల విభాగంలో నీలం రాజు, 71 కేజీల మహిళల విభాగంలో పల్లవి ఇప్పటికే స్వర్ణ పతకాలు గెలుపొందారు. తాజాగా 87 ప్లస్ కిలోల కేటగిరీలో విజయనగరం జిల్లాకు చెందిన టి.సత్యజ్యోతి విజయ ఢంకా మోగించారు. కాంస్యం పథకం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. కాగా, ఇప్పుడు సత్యజ్యోతికి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ యువ క్రీడాకారిణిని అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.
సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు..
ఉత్తరాఖండ్ వేదికగా 38వ జాతీయ క్రీడల్లో 87+ కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న విజయనగరానికి చెందిన టి.సత్యజ్యోతికి అభినందనలు. అమ్మా.. దేవుడు నీకు మరింత శక్తిని ఇవ్వాలని, నిరంతరం నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.
మంత్రి లోకేశ్ అభినందనలు..
"38వ జాతీయ క్రీడల్లో 87+ కిలోల విభాగంలో విజయనగరం బిడ్డ టి.సత్యజ్యోతి కాంస్య పతకం సాధించడం సంతోషంగా ఉంది. ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, అంకితభావం, కఠోర దీక్ష మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీలాంటి మహిళలు వెయిట్ లిఫ్టింగ్ రంగంలో అడ్డంకులను బద్దలు కొడుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తున్నారు. భవిష్యత్తులోనూ వెయిట్ లిఫ్టింగ్‌లో మరిన్ని కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijayawada: మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్.. సీఎం చంద్రబాబును కలిసి..
Ashwini Vaishnaw: ఏపీకి మరో గుడ్ న్యూస్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్