Share News

Parvathipuram Gurukulam: కురుపాం పచ్చకామెర్ల విద్యార్థినిలకు మెరుగైన వైద్యం...

ABN , Publish Date - Oct 05 , 2025 | 02:47 PM

విద్యార్థినిలకు పచ్చ కామెర్ల విషయంపై రాష్ట్ర స్థాయి అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నారని గౌతమి పేర్కొన్నారు. నీటి వల్ల ఈ వ్యాధి వచ్చిందనే అనుమానంతో అక్కడ వాటర్‌ను పరీక్షించినట్లు తెలిపారు.

Parvathipuram Gurukulam: కురుపాం పచ్చకామెర్ల విద్యార్థినిలకు మెరుగైన వైద్యం...

పార్వతీపురం మన్యం: కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పచ్చకామెర్ల వ్యాధి 5 శాతం కంటే ఎక్కువ ఉన్న విద్యార్థినులను అధికారులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు పార్వతీపురం ఆసుపత్రిలో గురుకులం సెక్రటరీ గౌతమి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినిలు పచ్చకామెర్ల బారిన పడడానికి గల కారణాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.


ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నారని గౌతమి పేర్కొన్నారు. నీటి వల్ల ఈ వ్యాధి వచ్చిందనే అనుమానంతో అక్కడ వాటర్‌ను పరీక్షించినట్లు తెలిపారు. నీటిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయిందని వివరించారు. పచ్చకామెర్లు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థినులు మొత్తం 36 మంది ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 120 మంది విద్యార్థినిలు చికిత్సపొందుతున్నట్లు గౌతమి స్పష్టం చేశారు.


కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో 611 మంది చదువుతున్నారు. అయితే.. గతంలో ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు పచ్చకామెర్ల లక్షణాలతో మృతి చెందారు. ఈ ఘటనతో సర్వత్రా ఆందోళన చెలరేగింది. దీంతో ప్రస్తుతం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి గల కారణాలు తెలుసుకోవడానికి అధికారులు తీవ్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 05 , 2025 | 05:01 PM