Share News

Vizianagaram: సిరాజ్ నివాసంలో సోదాలు

ABN , Publish Date - May 18 , 2025 | 10:11 PM

Vizianagaram: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అలాంటి వేళ.. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది.

Vizianagaram: సిరాజ్ నివాసంలో సోదాలు

విజయనగరం, మే 18: హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సయ్యద్ సమీర్‌, సిరాజ్ ఊర్ రెహ్మాన్‌‌లను పోలీస్ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అందులోభాగంగా సమీర్‌ను అతడి స్వస్థలం విజయనగరానికి పోలీసులు ఆదివారం తీసుకు వచ్చారు. ఆ క్రమంలో అతడి ఇంట్లో పేలుళ్లకు వినియోగించే నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియంను పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

వీరిద్దరు హైదరాబాద్‌తోపాటు విజయనగరంలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారు. అయితే వారి ప్రయత్నాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి.. వీరిద్దరిని శనివారం అరెస్ట్ చేశారు. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన సీరాజ్, సమీర్‌తో కలిసి డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.


వీరిద్దరికి సోషల్ మీడియాలో పరిచయమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మే 30వ తేదీ వరకు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు వీరిద్దరిని విచారించేందుకు అధికారులు పోలీస్ కస్టడీకి కోరనున్నారని తెలుస్తోంది.


ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అలాంటి వేళ.. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఇక పాక్ అయితే సరిహద్దున గల భారత్‌లోని రాష్ట్రాలపై డ్రోనులు, క్షిపణులతో దాడులకు దిగింది. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. అలాంటి వేళ.. భారత్‌లో ఏటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా, పోలీస్ వ్యవస్థ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. అందులోభాగంగా వీరి కుట్రను భగ్నం చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

K Dhanunjaya reddy: ధనుంజయ్ రెడ్డి అక్రమాలపై ఆరా

AP Capital: అమరావతికి మరో మణిహారం

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 18 , 2025 | 10:14 PM