Share News

Anupama Parameswaran: కంటతడి పెట్టుకున్న అనుపమ.. కారణం అదేనా..

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:55 PM

అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం చిత్రం పరదా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేశారు.

Anupama Parameswaran: కంటతడి పెట్టుకున్న అనుపమ.. కారణం అదేనా..
Anupama Parameswaran

విజయవాడ: అందాల భామ అనుపమ కండతడి పెట్టింది. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం పరదా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం సందడి చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన అనుమప మీడియా ముందు తన బాధను వెళ్లబోసుకున్నారు. పరదా చిత్రం చాలా కష్టపడి చేశామని కంటతడి పెట్టుకుంది.


ఈ చిత్రం చాలా కష్టపడి చేశాను.. ప్రతి ఒక్కరు చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడాలని అనుమప కోరారు. పరదా కథ వినగానే తాను చాలా ఎమోషనల్ అయ్యానని.. అంతే ఎమోషనల్‌తో నటించానని తెలిపారు. ప్రతి హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటుందని అన్నారు. దర్శకులు నిర్మాతలు తనమీద ఎంతో నమ్మకంతో చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. వాళ్ల నమ్మకాన్ని కచ్చితంగా ప్రేక్షకులు నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. కోస్టార్స్‌గా నటించిన సంగీత, దర్శన చాలా బాగా నటించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ.. వారి క్యారెక్టర్‌కి జీవం పోశారని చెప్పుకొచ్చారు. నటి దర్శన తెలుగు రాకపోయినా.. తెలుగు నేర్చుకొని మరి చిత్రంలో నటించారని వివరించారు. కాగా, అనుపమ పరమేశ్వర్ లేడీ ఓరియెంటెడ్ రోల్లో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

Updated Date - Aug 12 , 2025 | 07:05 PM