Visakhapatnam: విశాఖలో పేకాట మహిళలు అరెస్ట్.. సమాచారం ఇచ్చిన భర్త
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:58 PM
విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను తాజాగా విశాఖ నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ ఘటనలో ఆసక్తికర విషయం ఏమిటంటే..
విశాఖపట్నం: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను తాజాగా విశాఖ నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక లలితానగర్ ప్రాంతంలో మహిళలు పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ ఘటనలో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తన భార్య పేకాటకు బానిస అవుతోందని, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఒక భర్త ఆగ్రహంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, మహిళలు ఇలా పేకాటకు అడిక్ట్ అవడం నగరంలో కుటుంబ విభేదాలు, ఆర్థిక నష్టాలు వంటి సమస్యలకు దారితీస్తోంది.సాంప్రదాయికంగా పురుషులకే పరిమితమై కనిపించే పేకాటను మహిళలు కూడా అలవాటు చేసుకుంటున్నారన్న దానికీ ఈ ఘటన ఉదాహరణ. భర్తలే పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసుల చర్య, మహిళల అరెస్ట్.. ఇది సమాజంలో మారుతున్న పరిస్థితులను తెలియజేస్తుంది.
Also Read:
తిరుపతిలో దళిత డ్రైవర్‌పై దాడి.. పోలీసు శాఖ సీరియస్
రైలు Vs రోడ్.. హిమాలయ యాత్రకు బెస్ట్ ఆప్షన్ ఏది?
For More Latest News