Share News

Palla Simhachalam: పల్లా శ్రీనివాసరావు తండ్రి కన్నుమూత.. సీఎం సంతాపం

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:39 PM

Palla Simhachalam: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.

Palla Simhachalam: పల్లా శ్రీనివాసరావు తండ్రి కన్నుమూత.. సీఎం సంతాపం
Palla Simhachalam passes away

విశాఖపట్నం, జూన్ 7: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు (AP TDP Chief Palla Srinivas Rao) పితృవియోగం కలిగింది. ఈరోజు (శనివారం) కేర్ ఆస్పత్రిలో పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) (Palla Simhachalam) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు పల్లా సింహాచలం. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆస్పత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. పల్లా సింహాచలం మృతి పట్ల సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సహా, మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu Naidu

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తండ్రి పల్లా సింహాచలం మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా 1994లో గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి సింహాచలం కృషి చేశారని కొనియాడారు. పల్లా కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


సింహాచలం మృతికి చింతిస్తున్నా: డిప్యూటీ సీఎం పవన్

pawan-murali.jpg

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి, విశాఖ–2 మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి చెందారని తెలిసి చింతిస్తున్నానని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన విశాఖ నగరం, పరిసర ప్రాంతాలలో సమస్యలపై పోరాడారన్నారు. ప్రజా పక్షం వహిస్తూ విశాఖపట్నం అభివృద్ధికి కృషి చేశారన్నారు. పితృ వియోగంతో బాధపడుతున్న పల్లా శ్రీనివాస రావు, వారి కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంత్రి పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


మంత్రి లోకేష్ ప్రగాఢ సంతాపం

lokesh-accid.jpg

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతిపట్ల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలందించారన్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. పల్లా సింహాచలం సౌమ్యుడిగా పేరుగాంచారని తెలిపారు. శాసనసభ్యుడిగా ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచారని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని... పల్లా కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


మంత్రి సవిత దిగ్భ్రాంతి

Minister Savitha

మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాచలం ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. టీడీపీ అభివృద్ధికి పల్లా సింహాచలం అందించిన సేవలు మరువలేనివన్నారు. సింహాచలం మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటన్నారు. ఎమ్మెల్యేగా సింహాచలం అందించిన సేవలను విశాఖ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని మంత్రి సవిత పేర్కొన్నారు.


మంత్రి నారాయణ సంతాపం

minister-narayana.jpg

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మృతికి మంత్రి నారాయణ సంతాపం తెలిపారు. సింహాచలం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పల్లా సింహాచలం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని మంత్రి నారాయణ అన్నారు.


ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు అందించారు: అనిత

anitha-vangalapudi.jpg

పల్లా సింహాచలం మృతిపట్ల హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వక్తం చేశారు. పల్లా శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. పల్లా సింహాచలం ఎమ్మెల్యేగా విశాఖ ప్రజలకు ఎనలేని సేవలందించారని హోంమంత్రి అనిత తెలిపారు.


ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: ఎమ్మెల్యే సురేంద్ర బాబు

అనంతపురం: పల్లా సింహాచలం మృతి పట్ల కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్లా శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విశాఖ ప్రజలకు ఎనలేని సేవ చేసిన పల్లా సింహాచలం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మహిళలను కించపరిస్తే సహించం.. లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

భారతీ.. మీ ఆయన్ను అదుపులో పెట్టుకో.. అమరావతి మహిళల వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 05:13 PM