Simhachalam Incident: సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ ఏం తేల్చనుంది
ABN , Publish Date - May 01 , 2025 | 12:41 PM
Simhachalam Incident: సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారించేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు సింహగిరికి చేరుకుంది. కమిటీ సభ్యులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సుబ్బారావు స్వాగతం పలికారు. విచారణ కమిటీ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
విశాఖపట్నం, మే 1: సింహాచలంలో (Simhachalam) త్రిసభ్య విచారణ కమిటీ పర్యటిస్తోంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నిన్న (బుధవారం) తెల్లవారుజామున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం.. గోడ నిర్మాణం, క్యూలైన్ ఏర్పాటు అంశాలపై ఆరా తీస్తోంది. సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యుల బృందం ఈరోజు (గురువారం) సింహగిరికి చేరుకుంది. కమిటీ సభ్యులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సుబ్బారావు స్వాగతం పలికారు. విచారణ కమిటీ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన స్థలం వద్దకు చేరుకున్నారు. మట్టి శాంపిల్స్‌ను సేకరించారు. అలాగే గోడను ఎలా నిర్మించారు అనే దానిపై కమిటీ నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. గోడను ఎప్పుడు కట్టారు అనేదిపై సభ్యులు ఆరా తీస్తున్నారు. అనంతరం అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ అధికారులతో పాటు ప్రసాదం స్కీమ్ కింది ఈ నిర్మాణం జరిగిన నేపథ్యంలో టూరిజమ్ డిపార్ట్‌మెంట్ అధికారులను కూడా సమావేశానికి పిలిచారు.

Revanth On Caste Census: మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్రానికి రేవంత్ సూచన
గోడను ఎప్పుడు కట్టారు.. కట్టడానికి అనుమతి ఉందా.. డిజైన్‌ను ఎలా చేశారు.. ఎన్నిరోజుల క్రితం ఈ నిర్మాణాన్ని చేశారు అనే విషయాలపై కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణం అంతా కూడా టూరిజం ప్రసాదమ్ స్కీమ్ ఆధ్వర్యంలో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ గోడను నిర్మించిన నేపథ్యంలో..గోడ నిర్మాణానికి టూరిజం శాఖ అధికారులు సూచనలు ఇచ్చారా లేక.. దేవాదాయ శాఖ అధికారులు సూచనలపై నిర్మించారా అనే దానిపై విచారణ కమిటీ విచారిస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఈ గోడను నిర్మించారన్న విషయంపై కమిటీ దృష్టిసారించింది. అయితే అధికారుల సూచనల మేరకే తాత్కాలికంగా ఈ గోడను నిర్మించామని కాంట్రాక్టర్లు చెబుతున్న మాట. మొత్తానికి సింహాచలం ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఏం తేల్చనుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
Head Injury: తలకు దెబ్బ తగిలిందా? ఈ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి
BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన
Read Latest AP News And Telugu News