Share News

APSRTC: ఆర్టీసీ సేవలు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో..

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:31 AM

గూగుల్ మ్యాప్స్‌తో త్వరలో ఏపీఎస్ఆర్టీసీ అనుసంధానం కానుంది. ఈ మేరకు మ్యాప్స్‌లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్‌ చేస్తే.. ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్‌ ఉన్న బస్సుల టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది.

APSRTC: ఆర్టీసీ సేవలు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో..
APSRTC

అమరావతి: గూగుల్‌ మ్యాప్‌‌ సరికొత్త ఫీచర్స్‌ను జోడించనుంది. ఏఐ ఫీచర్‌ సహాయంతో గూగుల్‌ మ్యాప్‌ను అప్‌డేట్‌ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్‌లో ఇటీవల చేర్చిన సరికొత్త ఫీచర్‌లలో AI-ఆధారిత నావిగేషన్, EV ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం, మెరుగైన ట్రాఫిక్ అలెర్ట్‌లు, స్థానిక నిపుణుల సిఫార్సులు వీక్షణ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్‌లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడం వినియోగదారులకు మరింత సులభంగా ప్రయాణించడానికి సహాయపడతాయి.


అయితే.. గూగుల్ మ్యాప్స్‌తో త్వరలో ఏపీఎస్ఆర్టీసీ అనుసంధానం కానుంది. ఈ మేరకు మ్యాప్స్‌లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్‌ చేస్తే.. ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్‌ ఉన్న బస్సుల టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే.. ఏపీఎస్‌ఆర్టీసీ పలు వివరాలను గూగుల్‌కు అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీలో బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్‌సైట్, యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం ఉంది. కాగా, ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కూడా బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు.


గూగుల్‌ మ్యాప్స్‌లో గాజువాక నుంచి భీమవరం అని సెర్చ్ చేస్తే.. వీటి మధ్య దూరం ఎంత, బైక్, కారు, బస్, రైళ్లలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు కనిపిస్తాయి. అందులో బస్‌ సింబల్‌ ఉన్నచోట క్లిక్‌ చేస్తే గాజువాక నుంచి భీమవరంకి ఎన్ని ఆర్టీసీ బస్సులున్నాయి, అవి ఏ సమయాల్లో బయలుదేరతాయి..? ఎన్ని గంటల్లో చేరుకుంటాయనే వివరాలు వస్తాయి.

అక్కడ క్లిక్‌ చేస్తే ఆర్టీసీ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. అందులో టికెట్‌ బుక్‌ చేసుకొని, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. అయితే.. ఆర్టీసీ అధికారులు, గూగుల్‌ ప్రతినిధులతో చర్చించి ప్రయోగాత్మకంగా విజయవాడ - హైదరాబాద్‌ మార్గంలో దీనిని అమలు చేశారు. ఇదంతా మూడు నెలల కిందట పూర్తయింది. కొద్ది రోజుల పాటు దీనిని పరిశీలించగా విజయవంతంగా బుకింగ్స్‌ జరిగాయి. దీంతో ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయమున్న ఏసీ, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ సర్వీసులు ఏయే రూట్లలో తిరుగుతాయో వాటి వివరాలను గూగుల్‌కు అందజేశారు. అయితే.. వారంలో అన్ని రూట్లలో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బస్‌ టికెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఇవి చదవండి:

మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ

Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ

Updated Date - Nov 08 , 2025 | 07:40 AM