Share News

Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:15 AM

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రేడింగ్‌ ట్రెండ్‌, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ కారణంగా భారత ఈక్విటీ సూచీలు శుక్రవారం మరింత నష్టపోయాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో...

Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ

ఇంట్రాడేలో 83,000 కిందికి సెన్సెక్స్‌

వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే..

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రేడింగ్‌ ట్రెండ్‌, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ కారణంగా భారత ఈక్విటీ సూచీలు శుక్రవారం మరింత నష్టపోయాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 640 పాయింట్లు క్షీణించి 82,670.95 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి మళ్లీ కోలుకున్న సూచీ చివరికి 94.73 పాయింట్ల నష్టంతో 83,216.28 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.40 పాయింట్లు తగ్గి 25,492.30 వద్ద క్లోజైంది. సూచీలు నష్టపోవడం వరుసగా ఇది మూడో రోజు. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 1,300 పాయింట్లకు పైగా, నిఫ్టీ 440 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. కాగా గత నెల 31తో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 562 కోట్ల డాలర్ల మేర తగ్గి 68,973 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి:

ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య

ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 06:15 AM