Share News

Vizag : సాగరతీరాన్ని విన్యాసాలతో ముంచెత్తేందుకు.. మళ్లీ వచ్చిన నేవీ వీరులు..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:51 AM

విశాఖ వాసులను మురిపించేందుకు నేవీ డే వేడుకలు మళ్లీ తిరిగొచ్చాయి. సాగరతీరాన్ని అబ్బురపరిచే సాహస విన్యాసాలతో ముంచెత్తేందుకు నౌకదళ విన్యాసకులు వచ్చేస్తున్నారు. గతేడాది వేదికను పూరీకి మార్చి వైజాగ్ ప్రజలను నిరుత్సాహపరిచినా.. ఈసారి మాత్రం యధావిధిగా విశాఖలోనే జరగనున్నాయి. ఈ నెల 4వ తేదీ జరగనున్న..

Vizag : సాగరతీరాన్ని విన్యాసాలతో ముంచెత్తేందుకు.. మళ్లీ వచ్చిన నేవీ వీరులు..
Navy Day Celebrations

విశాఖ వాసులను మురిపించేందుకు నేవీ డే వేడుకలు మళ్లీ తిరిగొచ్చాయి. సాగరతీరాన్ని అబ్బురపరిచే సాహస విన్యాసాలతో ముంచెత్తేందుకు నౌకదళ విన్యాసకులు వచ్చేస్తున్నారు. గతేడాది వేదికను పూరీకి మార్చి వైజాగ్ ప్రజలను నిరుత్సాహపరిచినా.. ఈసారి మాత్రం యధావిధిగా విశాఖలోనే జరగనున్నాయి. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు నిర్వహిస్తోంది నావికాదళం. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆర్కే బీచ్‌లోనే వేడుకల జరుపుతోంది. అయితే, క్రితంసారి ఆనవాయితికీ భిన్నంగా ఒడిశాలోని పూరీ తీరంలో జరిపి వైజాగ్ వాసులను నిరాశపర్చినా.. ఈ ఏడాది మళ్లీ మన రాష్ట్రంలోనే నేవీడే వేడుకలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 4వ తేదీ జరగనున్న నౌకాదళ వేడుకల కోసం తీరంలో పూర్తిస్థాయిలో సన్నాహక విన్యాసాలు నిర్వహించారు నౌకాదళ నావికులు. గాలిలో గింగిర్లు తిరుగుతూ ఒళ్లు గగుర్పొడిచేలా నావికదళం చేసే విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. దీంతో అంబరాన్నంటేలా సముద్రంలో నేవీ చేపట్టే సాహస కృత్యాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. విశాఖ ప్రజలు.


నేవీ డే ప్రారంభం ఇలా..

1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో డిసెంబర్ 3న భారత వైమానిక స్థావరాలపై పీఎన్ఎస్ ఘాజీతో దాడికి దిగింది కరాచీ నావికాదళం. ఇందుకు ప్రతిగా కమాండర్ పటాన్ శెట్టి గోపాలరావు నాయకత్వంతో డిసెంబర్ 4న గుజరాత్‌లో దాగి ఉన్న వారిపై మెరుపుదాడి చేసి 'ఆపరేషన్ ట్రెడెంట్' ను విజయవంతంగా పూర్తిచేసింది. అప్పటి నుంచి ఈ గెలుపుకు చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే వేడుకలు నిర్వహిస్తోంది నౌకాదళం.


నేవీ డే వేడుకల్లో..

నేవీ డే సందర్భంగా నౌకదళంలో సేవలందిస్తూ ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ నివాళులర్పిస్తుంది నౌకాదళం. నౌకదళ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించేలా విశాఖ ‪ఆర్కేబీచ్‌లో యుద్ధ విన్యాసాలు చేస్తుంది తూర్పు నావికాదళం. సముద్రానికి, ఆకాశానికి మధ్య రోమాలు నిక్కబొడుచుకునేలా నౌకదళ వీరులు చేసే సాహసాలు చూసేందుకు వేలమంది ప్రజలు సాగరతీరానికి తరలివస్తారు. నేవీ యుద్ధ నైపుణ్యాలు, సామర్థ్యం, ఆయుధ సంపత్తి అందరికీ తెలిసేలా స్కై డైవింగ్ ఫైటర్ జెట్లు, హెలికాప్లర్లు, నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, సబ్‌మైరైన్, ఫైటర్ జెట్లు, స్కై డైవింగ్, నేవల్ బ్యాండ్ ప్రదర్శస్తారు. ఈసారి లేజర్ షో, డ్రోన్ షో, కళింగ చక్రవర్తి, మేకిన్ ఇండియా, భారత్ మ్యాప్, సింహం వంటి ఆకృతుల్లో యుద్ధవిన్యాసాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


నేవీ సన్నాహకాల్లో అపశృతి..

నేవీ సన్నాహక విన్యాసాల్లో భాగంగా విశాఖ తీరంలో ప్రాక్టీస్ చేస్తూ గురువారం ఇద్దరు నావికులకు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విమానాల నుంచి దిగుతున్న ఇద్దరు నావికుల పారాచూట్లు గాలి అనుకూలించక ఒకదానికొకటి ముడిపడి సముద్రంలో పడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన నౌకాదళ సిబ్బంది వారిని బోట్లపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చడం ప్రమాదం తప్పింది.

Updated Date - Jan 03 , 2025 | 09:51 AM