CM Chandrababu: సీఎంతో అమిత్ కళ్యాణి భేటీ... షిప్ బిల్డింగ్‌పై చర్చ
ABN , Publish Date - Nov 12 , 2025 | 10:08 PM
ఉమ్మడి కడప జిల్లాలో పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
విశాఖపట్నం, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి ఆసక్తి కనబరిచారు. బుధవారం సీఎం చంద్రబాబుతో అమిత్ కళ్యాణి విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణ్ చర్చించారు. ఆ క్రమంలో ఏపీలో ఉన్న వివిధ అవకాశాలను ఆయనకు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.
షిప్ బిల్డింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆయనకు సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీ తదితర ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు. ఇక గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ మారిందని అమిత్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.
అంతకు ముందు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు ఆయన చేరుకున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో ఉండనున్నారు.
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ కానున్నారు. ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు గురువారం విశాఖపట్నం తరలి రానున్నారు. వీరితో సైతం సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే నవంబర్ 14,15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నారై భాస్కరరెడ్డికి మధ్యంతర బెయిల్..
త్వరలో జైలుకు జగన్: పిల్లి మాణిక్యాల రావు
For More AP News And Latest News