Pilli Manikyala Rao: త్వరలో జైలుకు జగన్: పిల్లి మాణిక్యాల రావు
ABN , Publish Date - Nov 12 , 2025 | 07:10 PM
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అతి త్వరలో జైలుకు వెళ్లక తప్పదని లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాల రావు స్పష్టం చేశారు.
గుంటూరు, నవంబర్ 12: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అతి త్వరలో జైలుకు వెళ్లక తప్పదని లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాల రావు స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ విషయంలో చాలా మంది అరెస్ట్ అయ్యారన్నారు. గతంలో ఈవోగా విధులు నిర్వహించిన ధర్మారెడ్డి కల్తీ జరిగింది నిజమేనని.. పైవాళ్లు చెబితేనే చేశామని ఒప్పుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అయితే కల్తీ నెయ్యి అంశంలో దొరికి పోయామని తెలిసి పోయాక ఆ నెపం ఆవుల మీదకు వైఎస్ జగన్ నెట్టేశాడని చెప్పారు. ఆవు మంచి గడ్డి తినకపోతే పాలు కల్తీ జరుగుతాయని జగన్ చెబుతున్నారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు కేవలం గడ్డి తినే వాళ్లే చేస్తారన్నారు. అసలు వైఎస్ జగన్‌కు బుద్ది ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
ఈ ప్రపంచంలో ఏ పశువు పాలు కల్తీ ఉండవని.. జగన్ లాంటి వాళ్లే కల్తీ చేస్తారన్నారు. ధర్మారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వైఎస్ జగన్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారని.. ఆయన్ని విచారిస్తే ఇంకా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి వైఎస్ జగన్ గురికాక తప్పదని పిల్లి మాణిక్యాల రావు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్)ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించింది. ఆ క్రమంలో చాలా మందిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో మరింత మందికి నోటీసులు అందజేస్తారనే ఒక ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో పోలీసులు ముమ్మర తనిఖీలు
నన్ను క్షమించండి.. ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం..
For More AP News And Latest News