Share News

Praveen Prakash Apology: నన్ను క్షమించండి.. ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం..

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:46 PM

రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.

Praveen Prakash Apology: నన్ను క్షమించండి.. ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం..
Retired IAS Officer Praveen Prakash Apologizes

ఢిల్లీ: రిటైర్ట్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులకు సారీ చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉండగా వారిపట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు చింతిస్తున్నానని వీడియోలో పేర్కొన్నారు.


ఆయన వీడియోలో మాట్లాడుతూ.. గతేడాది సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్‌కు గురయ్యాను. ఏం తప్పు చేశాననే అంశంపై తీవ్రంగా ఆలోచించా.. 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశా.. నా సర్వీస్‌లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు.. చట్టానికి విరుద్ధంగా ఏనాడూ ప్రవర్తించలేదు.. 2000-2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశా.. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయి, కానీ.. ఒక్క తప్పుతో హీరోగా ఉన్న నేను విలన్‌గా మారిపోయి.. సమాజం పెట్టిన టెస్టులో నేను ఫెయిల్ అయ్యాను. తప్పు చేశాననే భావనతోనే VRSకు అప్లయ్ చేశాను.


2020లో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చింది. నాకంటే ఏబీ వెంకటేశ్వరరావు ఐదేళ్ల సీనియర్ ఆఫీసర్.. డీజీపీ ఆఫీస్ ఫైల్ ప్రకారమే .. ఏబీవీపై చర్యలు తీసుకోవచ్చని చెప్పాను. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో నేను చేసిన తప్పు అర్థమైంది.. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తప్పు జరిగిందంటూ ఏబీ వెంకటేశ్వరరావు, కృష్ణకిషోర్‌కు క్షమాపణలు చెప్పారు.


Also Read:

పేదలకి సొంతిల్లు ఉండాలనేది నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

టీటీడీ కల్తీ నెయ్యి కేసు... సీబీఐకి ధర్మారెడ్డి కీలక సమాచారం

For More Latest News

Updated Date - Nov 12 , 2025 | 03:18 PM