TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసు... సీబీఐకి ధర్మారెడ్డి కీలక సమాచారం
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:06 PM
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ సిట్‌కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందజేశారు.
తిరుపతి , నవంబర్ 12: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో (TTD Adulterated Ghee Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మా రెడ్డి (Dharma Reddy) అప్రూవర్‌గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగిందో సవివరంగా సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ పాలనలో టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఒత్తిడి వల్లే అవన్నీ జరిగినట్టు అంగీకారించారు. కల్తీపై సీబీఐ సిట్‌కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందించారు.
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండవ రోజు సీబీఐ సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోలెబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్ వేరువేరుగా విచారణకు హాజరయ్యారు. విచారణలో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారి.. ఈ వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలను సిట్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింగాల్‌ను ఉపయోగించుకుని కల్తీ నెయ్యికి కారణమైనట్టు ధర్మారెడ్డి బాంబు పేల్చారు.
ఇవి కూడా చదవండి...
పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్డేట్స్
Read Latest AP News And Telugu News