Andhra Pradesh: టీడీపీకి చెందిన 7 కుటుంబాలపై గ్రామ బహిష్కరణ..
ABN , Publish Date - Jan 02 , 2025 | 02:29 PM
7 Families Expelled: కాలం మారుతోంది.. కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి.. కానీ, కొందరు మనుషులు, వారి మనస్తత్వాలు మాత్రం అస్సలు మారడం లేదు. అవే పాతకాలం పోకడలు, అవే పట్టింపులు.. పంతాలకు పోతున్నారు.
కాకినాడ, జనవరి 02: కాలం మారుతోంది.. కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి.. కానీ, కొందరు మనుషులు, వారి మనస్తత్వాలు మాత్రం అస్సలు మారడం లేదు. అవే పాతకాలం పోకడలు, అవే పట్టింపులు.. పంతాలకు పోతున్నారు. కక్షలు, కార్పణ్యాలతో సాటి మనుషుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో ఏడు కుటుంబాలను వెలివేశారు గ్రామ పెద్దలు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని.. శుభకార్యాలకు, పనులకు పిలవకూడని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉప్పుమిల్లి గ్రామంలో ధాన్యం కొలగారి పాట సొమ్ముల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో పాటు.. రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపే విషయంలోనూ వివాదం చోటు చేసుకుందట. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం పార్టీకి చెందిన 7 కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేస్తూ తీర్మానించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అయితే, వెలి నిబంధనలను అమలు చేస్తున్న గ్రామ పెద్దలు వైసీపీకి చెందిన వారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రంలో ఫిర్యాదు చేశారు బాధితుడు మేడిశెట్టి దుర్గారావు. దీనిపై స్పందించిన కాజులూరు తహసీల్దార్ ఎల్. శివకుమార్, గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్‌లు గ్రామ పంచాయితీ కార్యాలయానికి వచ్చారు. వెలి బాధితులు, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసేందుకు గ్రామస్తులతో చర్చలు జరిపారు రెవెన్యూ, పోలీసు అధికారులు.
Aslo Read:
పుష్ప నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
బాబోయ్.. భర్తను నడిరోడ్డుపై ఉరివేసి చంపిన భార్య..
For More Andhra Pradesh News and Telugu News..