Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా.. రాజ్యసభ చైర్మన్ ఆమోదం..
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:09 PM
Vijaya Sai Reddy Resignation News: విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.. మరి నెక్ట్స్ ఏంటి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. విజయసాయి రాజీనామాను ఆమోదించారా.. అసలేం జరిగింది.. కీలక వివరాలు మీకోసం..

అమరావతి, జనవరి 25: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. విజయ సాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ శనివారం నాడు బులిటెన్ విడుదల చేశారు. వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన శనివారం ఢిల్లీకి వెళ్లి తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు ఇచ్చారు. దీంతో విజయసాయి రాజీనామాకు ఆయన ఆమోదం తెలిపారు.
అసలేం జరిగింది..
విజయసాయి రెడ్డి శుక్రవారం సాయంత్రం వేళ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా.. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన ప్రకటించినట్లుగానే.. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి. ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన తరువాత వైసీపీకి కూడా రాజీనామా చేయనున్నారు. కాగా, తన నిర్ణయాన్ని వైఎస్ జగన్‌కు సైతం చెప్పినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఇందులో ఎవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు విజయసాయి రెడ్డి.
Also Read:
విజయసాయి రెడ్డి రాజీనామాపై షర్మిల హాట్ కామెంట్స్
అమెరికాలో మొదలైన ట్రంప్ ఆపరేషన్..
ఐసీసీ టీమ్.. భారత్ హవా మామూలుగా లేదు
For More Andhra Pradesh News and Telugu News..