TTD Laddu Adulterated Ghee Case: కల్తీ నెయ్యి కేసులో.. ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ..
ABN , Publish Date - Nov 20 , 2025 | 07:31 PM
తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయనకు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, నవంబర్ 20: తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ పూర్తయింది. గురువారం నాడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. కల్తీ నెయ్యి విషయంలో భిన్న కోణాల్లో వైవీ సుబ్బారెడ్డిని విచారించారు. సుబ్బారెడ్డి పీఏ అప్పన్న స్టేట్‌మెంట్‌తోపాటు టీటీడీ బోర్డ్ చైర్మన్ హోదాలో టెండర్ల నిబంధనల సడలింపుపైనా ప్రశ్నలు సంధించారు. ఈ విచారణ అనంతరం స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. మరోసారి అవసరమైతే విచారిస్తామని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం హైదరాబాద్‌లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుని.. విచారణ చేపట్టింది. మధ్యాహ్నం భోజన విరామానికి ఆయనకు గంట సమయం ఇచ్చింది. అనంతరం మళ్లీ ఈ విచారణను కొనసాగించింది. దాదాపు 7 గంటలకు పైగా సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా గతంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న, టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులను విచారణలో భాగంగా వెల్లడించిన డాక్యుమెంట్లు, స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ విచారణను సిట్ అధికారులు చేపట్టారు. కాగా, సిట్ ప్రశ్నలతో సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు తెలుస్తోంది.
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News