-
-
Home » Andhra Pradesh » Today Breaking News In Telugu Live Updates Vallabhaneni Vamsi Arrest News and Bird flu Updates Thursday 13th February 2025 Amar
-
Breaking News: దస్తగిరి ఫిర్యాదు.. కీలక పరిణామం...
ABN , First Publish Date - Feb 13 , 2025 | 10:58 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-13T17:19:19+05:30
దస్తగిరి ఫిర్యాదు.. విచారణ షురూ..

వైఎస్ వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదుపై పోలీసు విచారణ ప్రారంభించారు.
దస్తగిరిఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 3వ తేదీన పులివెందుల పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
పులివెందులలో నమోదైన కేసు కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
దస్తగిరిఫిర్యాదు మేరకు చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, డిఎస్పీ నాగరాజు, సిఐ ఈశ్వరయ్యపై కేసు నమోదు చేశారు.
రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న దస్తగిరి, అతని భార్య షబానా.
డీఎస్పీ, సిఐలు ఇబ్బంది పెట్టిన ఘటనపై దస్తగిరి, ఆయన భార్యను విచారిస్తున్న పోలీసులు.
-
2025-02-13T14:15:08+05:30
లోక్ సభలో వక్ప్ సవరణ బిల్లు.
వక్స్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్.
నూతన ఐటి బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
-
2025-02-13T13:25:41+05:30
వల్లభనేని వంశీ కేసులో బిగ్ ట్విస్ట్
వల్లభనేని వంశీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను బెదిరించిన వంశీ
కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి
సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి, తీవ్రంగా ఒత్తడి తెచ్చారంటున్న కుటుంబ సభ్యులు
సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వంశీపై మరో కేసు
వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
వంశీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు మరింతమంది ముందుకువచ్చే ఛాన్స్
వంశీ వేధింపులపై ఓ మహిళ ఫిర్యాదు చేయనున్నట్లు ప్రచారం
-
2025-02-13T11:19:14+05:30
సుప్రీంకోర్టులో నటుడు మోహన్‌బాబుకు ఊరట
జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
మోహన్‌బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని
గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు
ఘటనపై బహిరంగంగా క్షమాపణ చెప్పానన్న మోహన్‌బాబు
నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపిన మోహన్‌బాబు
-
2025-02-13T11:13:57+05:30
టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ
ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతలల మధ్య ఘర్షణ
వట్లూరులో ఓ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో కారును ఆపిన వైసీపీ నేత డ్రైవర్
తన కారుకు అడ్డంగా వైసీపీ కారును పెట్టారని చింతమనేని ఆరోపణ
వైసీపీ నేత డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయిన చింతమనేని
కాసేపటి తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గర ఇరువర్గాలు వాగ్వాదం
పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం
వైసీపీ నేతలు కావాలనే కారును అడ్డంగా పెట్టారు-చింతమనేని
మాతో గొడవ పెట్టుకోవాలని చూశారు.. మేం ప్రశాంతంగా ఉన్నామన్ చింతమనేని
పోలీసులకు ఫిర్యాదు చేయాలని సెక్యూరిటీకి సూచించా- చింతమనేని
-
2025-02-13T11:04:53+05:30
2లక్షల కోళ్లు మృతి
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ
ఇటీవల పౌల్ట్రీ ఫాంలో రెండు లక్షల కోళ్లు మృతి
పరీక్షల్లో బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు నిర్ధారణ
బాదంపూడి, వేల్పూరు, కానూరు గ్రామాల్లో
కిలోమీటర్ వరకు రెడ్ జోన్, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్
-
2025-02-13T11:01:31+05:30
శ్రీకాకుళం: జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం
సంతబొమ్మాళి మండలం కాపు గోదాయవలసలో ఆందోళన
ఇటీవల పదేళ్ల బాలుడు యువంత్ మృతి
జీపీఎస్ లక్షణాలతో బాలుడు మృతి చెందాడంటూ ప్రచారం
గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారుల బృందం
గ్రామంలో విస్తృతంగా వైద్య పరీక్షలు
జీబీఎస్ లక్షణాలతో బాలుడు మృతి చెందినట్టు
ఇంకా నిర్ధారణ కాలేదంటున్న వైద్యాధికారులు
-
2025-02-13T10:58:13+05:30
ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం..
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక్క వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయినట్లు ప్రచారం
స్పందించిన అధికారులు
అటువంటి కేసు ఏమీ నమోదు కాలేదన్న అధికారులు
ప్రజలు పుకార్లు నమ్మవద్దన్న జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ మాలిని