Tirupati: నీట్ పీజీలో మెరిసిన తిరుపతి కుర్రోడు సాయినితేష్
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:30 AM
జాతీయ స్థాయి నీట్ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుచానూరు వీవీ లేఅవుట్‌కి చెందిన డాక్టర్ గండికోట సాయినితేష్ అత్యుత్తమ ప్రతిభ చాటి ఆలిండియా136వ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. ఈనెల 3న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలను ఇదే నెల 19న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో సాయినితేష్ 136వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు.
- ఆలిండియాస్థాయిలో 136వ ర్యాంకు కైవసం
తిరుపతి: జాతీయ స్థాయి నీట్ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుచానూరు(Tiruchanur) వీవీ లేఅవుట్‌కి చెందిన డాక్టర్ గండికోట సాయినితేష్ అత్యుత్తమ ప్రతిభ చాటి ఆలిండియా136వ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. ఈనెల 3న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలను ఇదే నెల 19న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో సాయినితేష్ 136వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఈ విద్యార్థి తిరుపతిలోని ఎస్వీమెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్(MBBS) కోర్సు పూర్తి చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని టాప్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో జనరల్ మెడిసిన్‌ని అధ్యయనం చేస్తానని అంటున్నాడు. కాగా ఈయన స్నేహలత, శ్రీధర్ (విద్యుత్‌శాఖలో డీఈఈ) దంపతుల కుమారుడు. చెల్లెలు జాహ్నవి పద్మావతి మెడికల్ కళాశాల (స్విమ్స్)లో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News