Tirupati: తిరిగి తిరిగి అలసిపోయా..
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:12 AM
‘నన్ను కులాంతర వివాహం చేసుకున్న శరత్‌కుమార్.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదు. కలెక్టరేట్ చుట్టూ నాలుగు పర్యాయాలు తిరిగినా న్యాయం జరగలేదు’ అంటూ ఇందు అనే మహిళ గన్నేరుపప్పు (విషపు కాయలు) తిని తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కు వచ్చారు.
- నా సమస్యపై అధికారులు పట్టించుకోలేదు
- గన్నేరుపప్పు తిని పీజీఆర్‌ఎ్‌సకు వచ్చిన మహిళ
- తిరుపతి కలెక్టరేట్‌లో కలకలం.. ఆస్పత్రికి తరలింపు
తిరుపతి: ‘నన్ను కులాంతర వివాహం చేసుకున్న శరత్‌కుమార్.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదు. కలెక్టరేట్ చుట్టూ నాలుగు పర్యాయాలు తిరిగినా న్యాయం జరగలేదు’ అంటూ ఇందు అనే మహిళ గన్నేరుపప్పు (విషపు కాయలు) తిని తిరుపతి కలెక్టరేట్(Tirupati Collectorate)లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎ్‌సకు వచ్చారు. జేసీ శుభంబన్సల్‌కు వినతిపత్రం ఇచ్చిన ఆమె.. అక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నారు.
దీంతో ఉలిక్కపడ్డ అధికారులు ప్రథమ చికిత్స కేంద్రంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సమాచారమిచ్చారు. అనంతరం డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ తన వాహనంలో ఆమెను రుయాస్పత్రికి తరలించారు. ఈమెది తిరుపతి నగరంలోని యాదవకాలనీ. ‘నాలుగేళ్ల కిందట శరత్‌కుమార్‌రెడ్డితో ఓటేరు సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహమైంది. అతడి కుటుంబ సభ్యులకు మా పెళ్లి ఇష్టంలేదు. నిత్యం నన్ను తక్కువ జాతి కులమని వేధించేవారు. ఓ మెడికల్‌షా్‌పలో పనిచేసే నా భర్త రూ.10 లక్షలు కట్నం తెస్తేనే రానిస్తామన్నాడు.
మే నెల 2న నన్ను వదలి వెళ్లిపోయాడు. నన్ను దళితురాలినంటూ వేధించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్నాడు. నేను అడిగితే వాళ్లు బెదిరిస్తున్నారు. నా భర్తను నాతో పంపేలా చేసి, నన్ను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద తిరుపతి ఈస్ట్ పోలీసులు రెండు నెలల కిందటే కేసు నమోదు చేసున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News