Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:25 PM
శ్రావణ మాసం.. శుభకరమైన మాసం. అయితే ఈ ఏడాది ఈ మాసంలో వరుస సెలవులు వచ్చాయి. దీంతో పలువురు తమ కుటుంబంతో కలిసి పుణ్య క్షేతాలను తరలి వెళ్తున్నారు.
సికింద్రాబాద్, ఆగస్ట్ 17: శ్రావణ మాసం.. శుభకరమైన మాసం. అయితే ఈ ఏడాది ఈ మాసంలో వరుస సెలవులు వచ్చాయి. దీంతో పలువురు తమ కుటుంబంతో కలిసి పుణ్య క్షేతాలను తరలి వెళ్తున్నారు. ఇప్పటికే శ్రీవారి భక్తులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం.. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. వీటిని ఆగస్టు 17, 18 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచనుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే (07097) నెంబర్ గల ప్రత్యేక రైలు ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే (07098) నెంబర్ గల మరో ప్రత్యేక రైలు ఆగస్టు 18వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, 2ఏసీ 3 ఏసీ, ఎకానమీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ స్టేషన్లలో ఆగుతాయి..
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
For More AP News And Telugu News