Share News

Tirupati: ఇక.. ఆటోలకూ క్యూఆర్‌ కోడ్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:46 PM

కొందరు ఆటోవాలాల ఆగడాలకు చెక్‌పెట్టేలా పోలీసులు క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో తిరుపతిలోని 200 ఆటోలను డిజిటలైజేషన్‌ చేశారు. తిరుపతి ట్రాఫిక్‌ డీఎస్పీ రామకృష్ణమాచ్చారి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్‌ గ్రౌండులో ఆటోల డిజిటలైజేషన్‌ కార్యక్రమం చేపట్టారు.

Tirupati: ఇక.. ఆటోలకూ క్యూఆర్‌ కోడ్‌

- తిరుపతిలో డిజిటలైజేషన్‌ నెంబర్ల కేటాయింపు

- దశలవారీగా జిల్లా అంతటా అమలు

- ప్రయాణికుల భద్రతకు పోలీసుల చర్యలు

తిరుపతి: కొందరు ఆటోవాలాల ఆగడాలకు చెక్‌పెట్టేలా పోలీసులు క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో తిరుపతిలోని 200 ఆటోలను డిజిటలైజేషన్‌ చేశారు. తిరుపతి ట్రాఫిక్‌ డీఎస్పీ రామకృష్ణమాచ్చారి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్‌ గ్రౌండులో ఆటోల డిజిటలైజేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఆటోకు డ్రైవర్‌ వెనుక సీటులో ట్రాఫిక్‌ పోలీసులు తయారు చేసిన క్యూఆర్‌ కోడ్‌తో పాటు అందులో వున్న ఎనిమిది అంశాలతో కూడిన స్టిక్కర్‌ను అతికించారు. ఎవరైనా ఆటో డ్రైవర్లు తమతో దురుసుగా ప్రవర్తించినా, మద్యం తాగి నడిపినా, ఇతర విలువైన వస్తువులు ఆటోలో పోగొట్టుకున్నా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ఇబ్బంది పెట్టినా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పంపితే చాలు.


వెంటనే ఆ ఆటో వివరాలు, ఎక్కడుందనేది కమాండ్‌ కంట్రోలు ద్వారా పోలీసులు గుర్తించి చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఆటోలో ప్రయాణించి దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు, దోపిడీలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే గుర్తించవచ్చని ఎస్పీ హర్షవర్ధన రాజు(SP Harshavardhana Raju) చెప్పారు. ఈ క్యూఆర్‌ కోడ్‌లో ట్రాఫిక్‌ డీఎస్పీతో పాటు సీఐలు, పోలీసు స్టేషన్‌ నెంబర్లు పొందుపరిచారు.


pandu1.2.jpgఆటో యజమాని పేరు, అడ్రస్‌, ఫొటో, డ్రైవింగ్‌ లైసెన్సు నెంబరు, స్టాండు ఏరియా, మొబైల్‌ నెంబరు, ఆటో నెంబరు, అత్యవసరమైన ఫోన్‌ నెంబర్లు ఉంటాయి. ఆటోలో ఎక్కిన వెంటనే ప్రయాణికుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మొబైల్‌లో ఉంచుకోవాలి. తద్వారా అందులో పొందుపరచిన ప్రింట్‌, షేర్‌ ఆన్‌ వాట్సాప్‌, ట్రాక్‌ లొకేషన్‌, అత్యవసర కాల్‌ నెంబర్లు, పోలీసు స్షేషన్‌ వివరాలు, ఫిర్యాదు చేయాలంటే సమీపంలోని పోలీసు స్టేషన్‌ ఏది అనే వివరాలు అందులో ఉంటాయి.


ప్రతి ఒక్కరూ కోడ్‌ ఎన్‌రోల్‌ చేసుకోవాలి

తిరుపతిలోని అన్ని ఆటోలకు తప్పనిసరిగా క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన రాజు విజ్ఞప్తి చేశారు. క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశాక అదనపు ఎస్పీలు రవిమనోహరాచ్చారి, నాగభూషణరావు, డీఎస్పీలు భక్తవత్సలం, శ్యాంసుందర్‌, రామకృష్ణమాచ్చారి, డీటీవో మురళీమోహన్‌, రైల్వే స్టేషన్‌ ఆటో స్టాండ్ల యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, సీఐలు సంజీవ్‌కుమార్‌, భాస్కర నాయక్‌, సుబ్బారెడ్డి, ఎస్‌ఐలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని 20వేలకుపైగా ఉన్న ఆటోలన్నీ తప్పనిసరిగా డిజిటలైజేషన్‌ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుల్లెట్‌రమణ, కృష్ణయాదవ్‌, మధు, ప్రమోద్‌, రామచంద్ర, ఆటో అసోసియేషన్‌ అధ్యక్షులు ఖాజా, ఆటో డ్రైవర్లు, అసోసియేషన్‌ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 12:46 PM