Tirupati: రాత్రి గస్తీల్లో డ్రోన్..
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:31 PM
రాత్రి గస్తీకి డ్రోన్ వినియోగానికి తిరుపతి పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ డ్రోన్లు వాడేందుకుగానూ అత్యంత శక్తివంతమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా వినియోగించనున్నారు. దీనిలో భాగంగా అర్ధరాత్రి తిరుపతి, శివారు ప్రాంతాల్లో డ్రోన్ ఎగురవేసి రాత్రి పహారా కాశారు
- పోలీసుల అదుపులో పది మందికి కౌన్సెలింగ్
తిరుపతి: ఇప్పటి వరకు రాత్రి గస్తీల కోసం కేవలం బ్లూకోల్స్ట్, రక్షక్ పోలీసులు మాత్రమే రోడ్లపై తిరిగేవారు. అన్ని వీధులు, సందులు, గొందుల్లోకి వెళ్ళడానికి వీరికి సాధ్యపడే పని కాకుండా పోయింది. ఈ క్రమంలో రాత్రి గస్తీకి డ్రోన్ వినియోగించాలని ఎస్పీ హర్షవర్ధనరాజు భావించారు. దీనికిగాను అత్యంత శక్తిమంతమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా వినియోగించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి తిరుపతి, శివారు ప్రాంతాల్లో డ్రోన్ ఎగురవేసి రాత్రి పహారా కాశారు.
ఈ వార్తను కూడా చదవండి: Leopard: అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌లోకి చొరబడిన చిరుత..
తద్వారా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న అకతాయిలు, కొందరు మందుబాబులను గుర్తించారు. అలా 10 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా రాత్రి గస్తీల్లో డ్రోన్‌నూ భాగస్వామిని చేయనున్నారు. దీనికోసం తిరుపతి(Tirupati) నగరాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌లో ఒక్కో రాత్రి డ్రోన్ నిఘా ఉంచుతారు. ఇది అరకిలోమీటరుకు పైగా నింగిలోకి వెళ్లి.. మూడు కిలోమీటర్ల వ్యవధిలో కవర్ చేస్తుంది.

ఏ సమయంలోనైనా.. ఎక్కడ నుంచైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే వెంటనే డ్రోన్ కెమెరా ద్వారా లొకేషన్ అడ్రస్ ట్రేస్ చేసి బాధితులకు న్యాయం చేసే వెసులుబాటు కలుగుతోంది. లొకేషన్ అడ్రస్ చెప్పడం ఆలస్యం కాకుండా డ్రోన్ కెమెరాను అటుగా దిశ మళ్ళించి ఆగమేఘాల మీద ఆకాశంలో దూసుకుంటూ స్పాట్‌కు చేరుతుంది. తద్వారా పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటారు. తిరుపతి ప్రజలు, భక్తులు అర్ధరాత్రయినా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనే ఉద్దేశ్యంతో ఈ వినూత్న ప్రయోగానికి శీకారం చుట్టినట్లు ఎస్పీ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News