Share News

Drunk Man Bites Off Snakes Head: పామును పక్కలో పెట్టుకుని పడుకున్నాడు.. తెల్లారి చూస్తే షాక్..

ABN , Publish Date - Sep 19 , 2025 | 03:58 PM

మద్యం తాగితే మనిషి తనను తానే మర్చిపోతాడని అంటారు. ఆ తాగిన మత్తులో వారు ఏం చేస్తారో కూడా ఊహించలేం. మందుబాబుల చేష్టలకు సంబంధించి మనం ఎన్నో వీడియోలు చూశాం. అచ్చం ఇలాంటి షాకింగ్ ఘటనే తిరుపతి..

Drunk Man Bites Off Snakes Head: పామును పక్కలో పెట్టుకుని పడుకున్నాడు.. తెల్లారి చూస్తే షాక్..

తిరుపతి, సెప్టెంబర్ 19: మద్యం తాగితే మనిషి తనను తానే మర్చిపోతాడని అంటారు. ఆ తాగిన మత్తులో వారు ఏం చేస్తారో కూడా ఊహించలేం. మందుబాబుల చేష్టలకు సంబంధించి మనం ఎన్నో వీడియోలు చూశాం. అచ్చం ఇలాంటి షాకింగ్ ఘటనే తిరుపతి జిల్లాలో ఒకటి వెలుగు చూసింది. తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్ (48) జాతర జోరులో ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో రాత్రి సమయంలో తూలుతూ ఇంటి దారి పట్టాడు. అలా వెళ్తుండగా.. అతన్ని ఓ పాము కాటేసింది. అసలే మద్యం మత్తులో ఉన్నాడు.. పాము కాటు అతన్నేం చేస్తుంది. క్షణం లేటు చేయకుండా ఆ పామును పట్టుకున్నాడు. నన్నే కాటేస్తావా అంటూ కోపం ఆ పాము తలను నోటితో కొరికేశాడు.


అంతటితో ఆగితేనా.. తల లేని పామును తీసుకుని ఇంటికి వెళ్లాడు. చడీ చప్పుడు కాకుండా ఆరుబయట ఉన్న మంచంలో పడుకున్నాడు. తెల్లవారాక అతని కుటుంబ సభ్యులు అతన్ని గమనించారు. అతని పక్కలో నల్లత్రాచు పాము కనిపించడంతో ఒక్కసారిగా హడలిపోయారు. పాము కాటు కారణంగా నిద్రలోనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటన బుధవారం రాత్రి సమయంలో చోటు చేసుకోగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.


Also Read:

AP Irrigation Projects: గత పాలనలో నిర్లక్ష్యమే.. ప్రాజెక్టులు ధ్వంసం: మంత్రి నిమ్మల

CM Revanth Reddy ON investments: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 19 , 2025 | 04:29 PM