Tirumala: తిరుమలలో అదే రద్దీ...
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:47 PM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తమిళులు అత్యంత పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ స్వగ్రామాల నుంచే తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది.
తిరుమల: తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తమిళులు అత్యంత పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ స్వగ్రామాల నుంచే తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. సెప్టెంబరు 17వ తేదీన పెరటాశి మాసం ప్రారంభమైనప్పటికీ 25వ తేదీ వరకు భక్తుల రద్దీ మోస్తరుగానే కనిపించింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 24వ తేదీతో పాటు 25 తేదీలు వీఐపీల హడావుడితో కనిపించిన క్షేత్రం.. 26 నుంచి మాత్రం భక్తులతో రద్దీగా మారిపోయింది.

27 పెరటాశి రెండో శనివారంతో పాటు మరుసటి రోజు 28న గరుడవాహనం కావడంతో ఆ మూడురోజులు తిరుమల కిటకిటాలడింది. ఆ రద్దీ ఇప్పటికీ కొనసాగుతోంది. సర్వదర్శన క్యూలైను ఆక్టోపస్ భవనం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తోంది. అర్ధరాత్రి దాటాక కూడా భక్తులు క్యూలైన్‌లోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత బాటగంగమ్మ ఆలయ సర్కిల్ సమీపంలోని క్యూలైన్‌కు తాళం వేయాల్సి వస్తోంది.

ఇక, అదనపు క్యూలైన్ ప్రవేశమైన అక్టోపస్ భవనం సర్కిల్ వద్ద బారికేడ్‌ను క్యూలైన్‌కు అడ్డుగా పెడుతున్నారు. తిరిగి అర్థరాత్రి తర్వాత భక్తులను క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు.
- 12 రోజుల్లో 8.9 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు.
- అత్యధికంగా 4న 83,380.. 5న 83,412 మంది దర్శించుకున్నారు.
- 11 రోజుల్లో 37.32 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
- 3,33,234 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa