Share News

TDP: టీడీపీ @1,00,20,065

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:35 AM

తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో కోటి మార్కును దాటాయి. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్దసంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమం. సంక్రాంతి పండుగ వేళ టీడీపీ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.

TDP: టీడీపీ @1,00,20,065

  • సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల రికార్డు బద్దలు

  • పార్టీ ఆవిర్భావం తర్వాత కోటి మార్కుకు తొలిసారి

  • టాప్‌లో నెల్లూరు నగరం.. ఐదో స్థానంలో కుప్పం

  • 2, 3 స్థానాల్లో ఆనం, నిమ్మల నియోజకవర్గాలు

  • తెలంగాణలో 15 లక్షల వరకూ సభ్యత్వాల నమోదు

అమరావతి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో కోటి మార్కును దాటాయి. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్దసంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమం. సంక్రాంతి పండుగ వేళ టీడీపీ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరం రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఐదో స్థానంలో ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన వంద రోజుల్లోనే టీడీపీ కోటి మార్కును అధిగమించింది. ఈ కార్యక్రమాన్ని గతేడాదినవంబరులో లాంఛనంగా మొదలు పెట్టారు. బుధవారం నాటికి ఆ పార్టీ సభ్యత్వం అధికారికంగా 1,00,20,065కు చేరింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొద్దిరోజుల్లో నిలిపివేస్తారని టీడీపీ వర్గాల సమాచారం. తెలంగాణలో నూ సుమారు 15 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.


నాలుగో స్థానంలో రాజంపేట

నెల్లూరు నగరంలో అత్యధికంగా 1,49,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరు (1,48,797), నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పాలకొల్లు (1,48,559) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాజంపేట (1,45,000) నాలుగో స్థానంలో నిలిచింది. ఇక చంద్రబాబు నియోజకవర్గం కుప్పం 1.38 లక్షలతో ఐదో స్థానంలో ఉంది. డిఫ్యూటీ స్పీకర్‌ రఘురామరాజు నియోజకవర్గం ఉండి (1.21 లక్షలు), యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం గురజాల (1.11లక్షలు), చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు నియోజకవర్గం వినుకొండ (1.06లక్షలు), మంత్రి లోకేశ్‌ నియోజకవర్గం మంగళగిరి (1.06 లక్షలు), సురేంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణదుర్గం(1.01 లక్షలు) వరుసగా టాప్‌-10లో ఉన్నాయి. ఇక కోవూరు, భీమిలి, ఉదయగిరి, కదిరి, కనిగిరి, పెనుకొండ, కావలి, కడప, రాప్తాడు, రాయదుర్గం 11 నుంచి 20 స్థానాలు సాధించాయి. ఈ 20 నియోజకవర్గాల్లో రాజంపేటకు వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కల్యాణదుర్గం, కోవూరు, ఉదయగిరి, పెనుకొండ, కావలి, కడపలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రఘురామరాజు తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆయన గతంలో లోక్‌సభ సభ్యు

Updated Date - Jan 16 , 2025 | 04:35 AM