Share News

TDP leader Namburi Seshagiri Rao: టీడీపీ పోరాటయోధుడు శేషగిరి మృతి

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:18 AM

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ గ్రామానికి చెందిన టీడీపీ పోరాట ..

TDP leader Namburi Seshagiri Rao: టీడీపీ పోరాటయోధుడు శేషగిరి మృతి
TDP leader Namburi Seshagiri Rao

  • గుండెపోటుతో ‘పాల్వాయిగేట్‌’ నేత హఠాన్మరణం

  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ విచారం

  • బాధిత కుటుంబానికి ఫోన్‌లో పరామర్శ

  • పిన్నెల్లి అరాచకాన్ని ఎదురొడ్డిన ధైర్యశాలి శేషగిరి

రెంటచింతల, మాచర్లటౌన్‌, అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ గ్రామానికి చెందిన టీడీపీ పోరాట యోధుడు నంబూరి శేషగిరిరావు(50) ఆదివారం ఉదయం ఇంటి వద్ద గుండెపోటుతో మృతిచెందారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్‌ రోజున అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేయగా.. ఆయన్ను నంబూరి శేషగిరిరావు ఎదిరించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. శేషగిరిరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం విషయం తెలియగానే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చారు. మృతదేహానికి నివాళులర్పించారు. శేషగిరిరావుకి ఆదివారం సాయంత్రం గ్రామస్థులు, టీడీపీ నాయకులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే, టీడీపీ యువ నాయకుడు నిఖిల్‌ అక్కడే ఉన్నారు.

శేషగిరిరావు కుటుంబానికి సీఎం పరామర్శ

శేషగిరిరావు మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శేషగిరిరావు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. శేషగిరిరావు పిల్లల చదువు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి గత ఎన్నికల్లో వీరోచిత పోరాటం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల రోజున వైసీపీ రౌడీల చేతిలో గాయపడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన శేషగిరిరావు ఒక పోరాట యోధుడు అంటూ అభివర్ణించారు. భౌతికంగా దూరమైనా, పార్టీకీ ఆయన చేసిన సేవలను శ్రేణులు గుర్తుంచుకుంటాయన్నారు. శేషగిరిరావు మృతిచెందారన్న వార్త తనను బాధించిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:18 AM