Share News

Supreme Court: మీ రక్షణ మీరే చూసుకోండి

ABN , Publish Date - May 09 , 2025 | 03:55 AM

మద్యం స్కాం కేసులో నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు, తమ రక్షణను తామే చూసుకోవాలంటూ స్పష్టం చేసింది

Supreme Court: మీ రక్షణ మీరే చూసుకోండి

  • మధ్యంతర రక్షణ కల్పించడం కుదరదు

  • ఆ ముగ్గురికీ సుప్రీంలో చుక్కెదురు

  • ముందస్తు బెయిల్‌కు నిరాకరణ

  • కేసు విచారణ 13కి వాయిదా

న్యూఢిల్లీ, మే 8(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణ వరకూ మీ రక్షణ అంశాన్ని మీరే చూసుకోవాలని, అప్పటివరకూ మధ్యంతర రక్షణ కల్పించడం కుదరదని స్పష్టం చేసింది. కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. వీరి పిటిషన్‌పై జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నిందితుల తరఫున న్యాయవాదులు వికాస్‌సింగ్‌, సిద్ధార్థ్‌ దవే, నాగముత్తు, ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ముకుల్‌ రోహత్గి, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ విచారణకు హాజరయ్యారు.


హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే నిందితులు సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారని ముకుల్‌ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌కు ఇప్పుడు విచారణ అర్హత లేదని తెలిపారు. పిటిషన్‌ను సవరించుకోడానికి నిందితులు చేసిన విజ్ఞప్తిని అనుమతించిన కోర్టు.. తదుపరి విచారణలోగా సవరించిన పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. అప్పటివరకైనా మధ్యంతర రక్షణ కల్పించాలని నిందితులు కోరగా.. కుదరదని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..

ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:55 AM