Srisailam Reservoir: శ్రీశైలంలో 10గేట్లతో నీటి విడుదల
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:01 PM
శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ జూరాల స్పిల్‌వే, సుంకేసుల, హంద్రీ నుంచి డ్యాంకు 3.58లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం పది గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద వేగం పుంజుకోవడంతో గేట్ల ఎత్తును 14 అడుగులకు ఇంజనీర్లు పెంచారు.
- నీటి నిల్వ సామర్థ్యం 203 టీఎంసీలు
శ్రీశైలం: శ్రీశైలం రిజర్వాయర్(Srisailam Reservoir)కు ఎగువ జూరాల స్పిల్‌వే, సుంకేసుల, హంద్రీ నుంచి డ్యాంకు 3.58లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం పది గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద వేగం పుంజుకోవడంతో గేట్ల ఎత్తును 14 అడుగులకు ఇంజనీర్లు పెంచారు. రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యు దుత్పత్తి అనంతరం 65,482 క్యూసెక్కులు విడుదల చేశారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 31.869 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు జెన్‌కో అధికారులు అనుసంధానం చేశారు. మంగళవారం సాయంత్రం నీటినిల్వ సామర్థ్యం 203 టీఎంసీలుగా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..
భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Read Latest Telangana News and National News