Srikakulam Kasibugga Tragedy: ఆలయంలో అత్యంత విషాదం.. స్పాట్ లోనే పది మంది మృతి.!
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:22 PM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో..
శ్రీకాకుళం: కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల వివరాలు ఇవే..
మృతులు ఏదూరి చిన్నమ్మ (టెక్కలి రామేశ్వరం)
మృతులు రాపాక విజయ (టెక్కలి),
యశోదమ్మ (శివరాంపురం)
మృతులు నేలమ్మ(దుక్కవానిపాటి),
రాజేశ్వరి (బెల్లిపటియా)
ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి