Teacher Misconduct: బాలికలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:56 PM
పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్‌కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సదరు ఉపాధ్యాయురాలు స్టూడెంట్స్‌తో కాళ్లు పట్టించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తోన్న ఉపాధ్యాయురాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చి, ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ ఉదంతం మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతో గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, బాధ్యతలకు తిలోదకాలిచ్చి.. ఇవేం పనులంటూ జనం తిట్టిపోస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
Read Latest Telangana News and National News