Share News

Bahuda River: బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:45 AM

ఒడిశాలోని భగలట్టి డ్యాం గేట్లు ఎత్తివేయటంతో బాహుదా నదికి వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత ప్రవాహం 51,228 క్యూసిక్స్‌గా ఉంది.

Bahuda River: బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం
Bahuda River

శ్రీకాకుళం, అక్టోబర్ 29: మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావంతో జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇచ్ఛాపురం జలదిగ్భంధంలో ఉండిపోయింది. ఒడిశాలోని భగలట్టి డ్యాం గేట్లు ఎత్తివేయటంతో బాహుదా నదికి వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుత ప్రవాహం 51,228 క్యూసిక్స్‌గా ఉంది. ఇక భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగలు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరద కారణంగా ఇచ్ఛాపురంలోని పాత వంతెన వద్ద నిర్మించిన శివాలయం నీటమునిగింది.


అలాగే పాత శాసనం, జగన్నాధపురం, ఇన్నేసుపేట, ఈదుపురం, బూర్జపాడు, డొంకూరు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి.. డిప్యూటీ సీఎం ఆదేశం

శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 12:32 PM