Somireddy Slams YS Jagan: భోగాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టించుకున్న పెద్ద మనిషి జగన్: సోమిరెడ్డి
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:09 PM
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు సంబంధం లేని గూగుల్ అంశంలో క్రెడిట్ దక్కించుకునేలా ఆయన మాట్లాడుతున్నారంటూ ఆగ్రహించారు.
అమరావతి, అక్టోబర్ 23: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ చేసిన కామెంట్లు చూస్తే పాపాలు చేసే వాళ్లు నీతులు చెప్పినట్లు ఉన్నాయని దుయ్యబట్టారు.
ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy)మాట్లాడుతూ.. 'నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని జగన్ బుకాయిస్తాడు. తనకు సంబంధం లేని గూగుల్ అంశంలో తానే క్రెడిట్ దక్కించుకునేలా మాట్లాడుతున్నాడు. డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చారట. ఇలాంటి మాటలు చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి, మాట్లాడ్డానికైనా బుద్ధి ఉండాలి. డేటా సెంటర్(Google Investments) అంటే దానికేం సీన్ లేదు... అదో గొడౌన్ మాత్రమేనని సాక్షిలో రాయిస్తారు. మళ్లీ దాన్ని రాష్ట్రానికి తానే తీసుకొచ్చానని అంటాడు. అప్పట్లో కియా కార్ల కంపెనీని తెచ్చింది.. తన తండ్రేనని, ఇప్పుడు గూగుల్ సంస్థను తానే తెచ్చానని చెప్పుకుంటున్నాడు. గూగుల్ సంస్థనైనా తాడేపల్లి ప్యాలెస్ గూట్లో పెట్టేసే ఇంటర్నేషనల్ నేరస్తుడు జగన్. పెట్టుబడులు రాకుండా చేసి... సొంత కంపెనీల ద్వారా మద్యం సరఫరా చేయించి ప్రజా ధనాన్ని గుటుక్కుమని మింగిన జగన్... గూగుల్ తెచ్చారా..?.
మద్యం విషయంలోనూ జగన్(ys Jagan) అనేక అసత్యాలు మాట్లాడారు. జనార్దన్ రావు-జోగి బంధం బయటపడిన తర్వాత కూడా ఇంకా అవాకులు చవాకులు పేల్చుతున్నారు. జోగి-జనార్దన్ రావు కాంబినేషనులో నకిలీ మద్యాన్ని(Liquor Business) తయారు చేయించింది చాలక... ఇంకా పిచ్చి కబుర్లు చెబుతారా?. క్యూఆర్ కోడ్ తో వాస్తవాలేంటో తెలుసుకోండంటే... డైవర్షన్ అంటావేంటి జగన్. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ దుకాణదారులే కాదు... వినియోగదారులూ స్కాన్ చేసుకోవచ్చు. కావాలంటే జగన్ కూడా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. భోగాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్న పెద్ద మనిషి... భోగాపురం ఎయిర్ పోర్టు గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లూ జగన్ సగం పిచ్చొడనుకున్నాం.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తే.. పూర్తిగా పిచ్చోడని తెలిసింది' అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Slams YS Jagan) అన్నారు.
ఇవి కూడా చదవండి: