Smart Ration Card: మా స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడుంది..
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:02 AM
నా పేరు స్రవంతి. మేము తిరుపతిలోని అశోక్‌నగర్‌లో ఉంటున్నాం. మా స్మార్టు రేషన్ కార్డు ఎక్కడ ఇస్తున్నారో తెలియక నాలుగు రోజులుగా జీవకోన, సత్యనారాయణ పురం, అశోక్‌నగర్, తుడా ఆఫీసు వద్ద వున్న సచివాలయాలకు వెళ్లి చూశాం. ఎవరిని అడిగినా సరైన సమాధానం లేదు.
- సచివాలయాల చుట్టూ చక్కర్లు
(తిరుపతి, ఆంధ్రజ్యోతి)
- నా పేరు స్రవంతి. మేము తిరుపతిలోని అశోక్‌నగర్‌లో ఉంటున్నాం. మా స్మార్టు రేషన్ కార్డు(Smart Ration Card) ఎక్కడ ఇస్తున్నారో తెలియక నాలుగు రోజులుగా జీవకోన, సత్యనారాయణ పురం, అశోక్‌నగర్, తుడా ఆఫీసు వద్ద వున్న సచివాలయాలకు వెళ్లి చూశాం. ఎవరిని అడిగినా సరైన సమాధానం లేదు. తీరా మా ప్రాంతానికి సంబంధంలేని ఓ వీఆర్వోను సంప్రదిస్తే జీవకోనలోని సచివాలయంలో ఉందన్నారు. అక్కడకు వెళ్లి అడిగినా సరైన సమాధానం లేదు. తీరా అదే జీవకోనలో పదో వార్డులో నా కార్డు ఉంది.
- నా పేరు మనోహరి. మాది బాలాజీ కాలనీ. ఇప్పటి వరకు మేము బాలాజీ కాలనీలోనే రేషన్ తీసుకుంటున్నాం. స్మార్టు కార్డు గురించి మా సచివాలయంలో వీఆర్వోని అడిగితే ఇక్కడకు రాలేదన్నారు. ఇంతకు ముందు ఎక్కడ కాపురమున్నారో అక్కడకు వెళ్లి తీసుకోండని చెప్పారు. అక్కడకు వెళితే మా కార్డు చింతలచేనులోని సచివాలయంలో ఉందన్నారు. అక్కడా నా కార్డు దొరకలేదు. ఇలా వారం రోజులుగా తిరిగినా.. ఇప్పటికీ దొరకలేదు.
.. ఇది స్రవంతి, మనోహరి సమస్యే కాదు. ఇలా ఎందరో స్మార్టు కార్డులకోసం తిరుగుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,91,259 పాత కార్డులున్నాయి. కొత్తగా మరో 44,937 స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ కార్డులకే స్మార్ట్ రేషన్ కార్డులను సంబంధిత వార్డు సచివాలయాల్లోని వీఆర్వోలు, వెల్ఫేర్ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వంలో చేసిన రేషన్ కార్డుల మ్యాపింగ్‌తో.. ఎవరి కార్డు ఎక్కడుందో తెలియక కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా స్మార్టు కార్డులను పంపిణీ చేస్తున్నా చాలా మందికి వారి కార్డు ఎక్కడుందో తెలియని పరిస్థితి.
దీంతో సచివాలయాల వద్ద కార్డుదారులు గుంపులుగా చేరుతున్నారు. తమకు స్మార్టు రేషన్ కార్డు వచ్చిందా.. లేదా అంటూ అధికారులను అడుగుతున్నారు. కొందరు డీలర్ల వద్దకెళ్లి కీ రిజిస్టర్ పరిశీలించినా అక్కడ కూడా కొంతమంది కార్డులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి కీ రిజిస్టర్ ఆధారంగా పంపిణీ చేస్తే కొంత వరకు సమస్య తగ్గుతుంది. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, వచ్చే నెల ఒకటో తేది నుంచి డీలర్లు స్మార్టు కార్డులను అందజేస్తారని అన్నారు. అంత వరకు ఓపిగ్గా ఉండాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News