Share News

AP Municipal Department: ఎస్‌ఈల సీనియారిటీ జాబితాకు ఆమోదం

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:01 AM

పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం పీహెచ్‌ఎంఈడీ లో సూపరింటెండింగ్‌

AP Municipal Department: ఎస్‌ఈల సీనియారిటీ జాబితాకు ఆమోదం

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం(పీహెచ్‌ఎంఈడీ)లో సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌(ఎ్‌సఈ)ల జాబితాను మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ విడుదల చేసింది. 38 మంది ఎస్‌ఈల సీనియారిటీ జాబితాను ఆమోదిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

పలువురు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న అదనపు డైరెక్టర్‌ ఎస్‌.రవీంద్రబాబును సీడీఎంఏ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌(సెలక్షన్‌ గ్రేడ్‌)గా, సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జి.రవిని రాయచోటి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ కమిషనర్‌గాను, అక్కడ ఉన్న వాసుబాబును నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీపీఆర్‌వోగా నియమించారు. పి.భవానీ ప్రసాద్‌ను శ్రీకాళహస్తి మున్సిపల్‌ కమిషనర్‌గా, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.సురేశ్‌ను శ్రీకాకుళం పట్టణాభివృద్ధి అథారిటీ గ్రేడ్‌-1 సెక్రటరీగా నియమించారు. టీటీ రత్నకుమార్‌ను సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌గా, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డి.కొండయ్యను ప్రొద్దుటూరు అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా, కదిరిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బి.ప్రహ్లాద్‌ను కమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 05:02 AM