ISRO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
ABN , Publish Date - Dec 22 , 2025 | 09:57 AM
ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 లాంచ్‌కు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరారు. ఇది భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిన అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
తిరుమల, డిసెంబర్ 22: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మేజర్ మిషన్లకు ముందు ఇస్రో అధికారులు తిరుమల దర్శనం చేసుకోవడం సంప్రదాయం. ఈసారి డిసెంబర్ 24న జరగబోయే ముఖ్యమైన లాంచ్‌కు శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల 24వ తేదీ ఉదయం 8:54 గంటలకు శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం-3 ఎం6 (LVM3-M6) ద్వారా అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ కంపెనీకి చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి పంపిన అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
ఇది.. దాదాపు 223 చదరపు మీటర్ల భారీ ఫేజ్డ్ అరే ఆంటెన్నాతో కూడినది. ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సాధారణ స్మార్ట్‌ఫోన్లకు నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి, మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలు, సముద్రాలు, ఎడారుల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, వీడియో స్ట్రీమింగ్ సాధ్యమవుతుంది.
ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ద్వారా జరిగే కమర్షియల్ మిషన్. ఇస్రో ఈ ఏడాది ఫుల్ బిజీగా ఉంది. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి మిషన్లతో పాటు కమర్షియల్ లాంచ్‌లు కూడా పెరుగుతున్నాయి. ఈ మిషన్ విజయవంతమై భారత్ స్పేస్ సెక్టార్‌లో మరింత బలోపేతం అవుతుందని అంచనా.
ఇవి కూడా చదవండి..
ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్
మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి